Life style: వేగంగా నడిస్తే ఆ సమస్య పరార్.. పరిశోధనల్లో ఆసక్తిర విషయాలు..
టైప్ 2 డయాబెటిస్ రోగులపై జరిపిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్టోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. వేగంగా నడవడం వల్ల టైప్2 డయాబెటిస్ సమస్య తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిరోజూ గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే డయాబెటిస్ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు....
ప్రస్తుతం యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో డయాబెటిస్ ఒకటి. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. మారుతోన్న జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా డయాబెటిస్ రోగులు పెరుగుతున్నారు.
టైప్ 2 డయాబెటిస్ రోగులపై జరిపిన పరిశోధనల్లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్టోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. వేగంగా నడవడం వల్ల టైప్2 డయాబెటిస్ సమస్య తగ్గుముఖం పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిరోజూ గంటకు 4 కిలోమీటర్ల వేగంతో నడిస్తే డయాబెటిస్ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. పరిశోధనల్లో భాగంగా అమెరికా, బ్రిటన్‌లకు చెందిన 508121 మందిని పరిగణలోకి తీసుకున్నారు.
నడక వేగం పెరిగే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 15 శాతం తక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. గంటకు కనీసం 4 నుంచి 5 కిలోమీటర్ల వేగంతో నడిస్తే డయాబెటిస్ బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన పురుషులు నిమిషానికి 87 అడుగులు వేయాలని, మహిళలు నిమిషానికి 100 అడుగులు నడిస్తే డయాబెటిస్‌కు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు.
ఇదిలా ఉంటే 2045 నాటికి టైప్ 2 డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య 537 మిలియన్ల నుంచి 783 మిలియన్లకు చేరుతుందని అంచనా. ఇక ఇరాన్‌లోని సెమ్నాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పరిశోధకులు వేగంగా నడవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కేవలం డయాబెటిస్ నివారించడమే కాకుండా, అనేక సామాజిక, మానసిక, శారీరక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..