Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మొబైల్ ఛార్జ్‌ పిన్‌ను తాకితే షాక్‌ ఎందుకు రాదు.? అసలు లాజిక్‌ ఏంటంటే..

సాధారణంగా కరెంట్ పాస్‌ అయ్యే ఈ వైర్‌ అయినా కరెంట్ షాక్‌ వస్తుంది. కానీ మొబైల్‌ ఛార్జింగ్ పాయిట్ మాత్రం షాక్‌ రాదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా.? ఛార్జర్‌ పిన్‌ను తాకినా షాక్‌ రాకపోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్‌ ఛార్జర్‌ల నుంచి వచ్చే విద్యుత్‌ ఏసీ నుంచి డీసీలోకి మారుతుంది. అలాగే కరెంట్‌ సంభావ్య వ్యత్యాసం...

మొబైల్ ఛార్జ్‌ పిన్‌ను తాకితే షాక్‌ ఎందుకు రాదు.? అసలు లాజిక్‌ ఏంటంటే..
Mobile Charging
Follow us
Narender Vaitla

|

Updated on: Dec 09, 2023 | 4:23 PM

ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితి ఉంది. జీవితంలో ఫోన్‌ ఓ భాగమైపోయింది. స్మార్ట్‌ ఫోన్స్‌లో ప్రధానంగా ఛార్జింగ్ బాగుండాలని కోరుకుంటారు. ప్రాసెసర్, కెమెరాతో పాటు రకరకాల యాప్స్‌ కారణంగా ఛార్జింగ్ త్వరగా తగ్గిపోతుంది. దీంతో ఛార్జింగ్ పాయింట్స్‌ ఎక్కడా ఉన్నాయా అని చూస్తుంటారు. ఇదంతా ఇలా ఉంటే.. మొబైల్ ఫోన్‌ ఛార్జింగ్ పెట్టే సమయంలో ఛార్జర్‌ పిన్‌ను పట్టుకుంటే షాక్‌ రాదు.

సాధారణంగా కరెంట్ పాస్‌ అయ్యే ఈ వైర్‌ అయినా కరెంట్ షాక్‌ వస్తుంది. కానీ మొబైల్‌ ఛార్జింగ్ పాయిట్ మాత్రం షాక్‌ రాదు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా.? ఛార్జర్‌ పిన్‌ను తాకినా షాక్‌ రాకపోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్‌ ఛార్జర్‌ల నుంచి వచ్చే విద్యుత్‌ ఏసీ నుంచి డీసీలోకి మారుతుంది. అలాగే కరెంట్‌ సంభావ్య వ్యత్యాసం 5V, 9V, 12V వరకు గరిష్టంగా ఉంటుంది. దీంతో చిన్న మొత్తంలో కరెంట్‌ ప్రవాహం శరీరం నుంచి ప్రవహించదు. అందుకే ఛార్జర్‌ పిన్‌ను పట్టుకున్నా కరెంట్ షాక్‌ తగలదు.

అయితే ఫోన్‌ ఛార్జర్‌ పిన్‌ పట్టుకుంటే కరెంట్ షాక్‌ రాదన్నదాంట్లో నిజం ఉన్నా. కొన్ని సందర్భాల్లో మాత్రం కరెంట్‌ షాక్‌ వచ్చే ప్రమాదం ఉంది. మొబైల్ ఫోన్‌ ఛార్జింగ్‌ కారణంగా విద్యుత్‌ షాక్‌ గురై మరణించిన సందర్భాలు చాలా సార్లు చూశేం ఉంటాం. కరెంట్‌ షాక్‌ రాదు కదా అని పట్టుకుంటే మాత్రం భారీ మూల్యం చెల్లించక తప్పదు. కొన్ని ఇల్లలో 220V లేదా 110V గ్రిడ్‌కు కనెక్ట్ అయి ఉంటాయి.

ఇలాంటి సందర్భాల్లో నేరుగా ఏసీ పవర్‌ నేరుగా ఫోన్‌లోకి సప్లై అవుతుంది. ఇలాంటి సందర్భాల్లో విద్యుత్ ఘాతానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. విద్యుత్‌ సరఫరాలో ఉండే అసమాతల కారణంగా కూడా కరెంట్ షాక్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తడి చేతులతో ఛార్జర్‌ను పట్టుకున్నా, నాలుకతో టచ్‌ చేసినా షాక్‌ కొడుతుంది. కాబట్టి మొబైల్‌ ఛార్జింగ్‌ను ఉపయోగించే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..