తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. నాని మూవీ తర్వాత ఆ హీరోతో..

Rajeev 

19 April 2025

Credit: Instagram

 శ్రీనిధి శెట్టి  ప్రధానంగా కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తుంది. కేజీఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. 

1992 అక్టోబర్ 21న కర్ణాటకలోని మంగళూరు సమీపంలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది శ్రీనిధి.  

శ్రీనిధి తన కెరీర్‌ను మోడలింగ్‌తో ప్రారంభించింది. 2015లో మిస్ కర్ణాటక , మిస్ బ్యూటీఫుల్ స్మైల్ టైటిల్స్, 2016లో మిస్ సుప్రనేషనల్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది.

2018లో కన్నడ చిత్రం KGF: చాప్టర్ 1తో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో రీనా దేశాయ్ పాత్రలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

KGF: చాప్టర్ 2 లో కూడా ఆమె నటించి, SIIMA అవార్డు ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ - కన్నడను గెలుచుకుంది. ఈ రెండు చిత్రాల కోసం దాదాపు ఏడేళ్లు పట్టింది,

ఈ బ్యూటీ తమిళ చిత్రం కోబ్రా (2022)లో విక్రమ్ సరసన నటించింది, అయితే డైలాగ్ డెలివరీలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొంది.

ప్రస్తుతం తెలుగులో సిద్ధూ జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా,  నాని నటిస్తున్న హిట్-3లో హీరోయిన్‌గా నటిస్తోంది.