AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Srikrishna: నందనందనుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరిపై గోపాలుడు అనుగ్రహం అంతులేనిదట

హిందూ ధర్మంలో దేవుడి ముందు అంతా సమానమే అని నమ్ముతారు. తన భక్తులందరినీ భగవంతుడు ఒకే విధంగా ఆశీర్వదిస్తాడని విశ్వాసం. అయితే దేవుళ్ళకు కూడా అత్యంత ఇష్టమైన..భక్తులు.. దేవుడికి ఇష్టమైన రాశులు ఉంటాయట. శ్రీ మహా విష్ణువు ఎనిమిదవ అవతారమైన శ్రీ కృష్ణుడికి కూడా కొన్ని ఇష్టమైన రాశులున్నాయట. వీరు కన్నయ్య ఆశీర్వాదంతో ఎప్పుడూ సుఖ సంతోషాలతో జీవిస్తారట.

Lord Srikrishna: నందనందనుడికి ఇష్టమైన రాశులు ఇవే.. వీరిపై గోపాలుడు అనుగ్రహం అంతులేనిదట
Lord Sri Krishna
Surya Kala
|

Updated on: Apr 19, 2025 | 1:53 PM

Share

సనాతన ధర్మంలో విష్ణువు ఎనిమిదవ అవతారంగా భావించే శ్రీకృష్ణుడుకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. శ్రీకృష్ణుడు వృషభ రాశి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. అయితే ఈ నంద గోపాలుడికి కొన్ని రాశులకు దగ్గరి సంబంధం ఉందట. ముఖ్యంగా నాలుగు రాశులంటే అమితమైన ఇష్టమట. ఈ రోజు కన్నయ్య అనుగ్రహాన్ని సొంతం చేసుకున్న ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

వృషభ రాశి: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం శ్రీకృష్ణుడు వృషభ రాశిలో జన్మించాడు. కనుక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు శ్రీకృష్ణుని హృదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటారని నమ్ముతారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ కెరీర్లలో గొప్ప విజయాన్ని సాధించవచ్చు. జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి వృషభ రాశి వారు శ్రీకృష్ణుడిని పూజించాలని పండితులు సూచించారు.

కర్కాటక రాశి: శ్రీ కృష్ణుడికి ఇష్టమైన రాశి కర్కాటక రాశి. పురాతన నమ్మకాల ప్రకారం ఈ రాశిలో జన్మించిన వారిని అదృష్టవంతులుగా భావిస్తారు. శ్రీకృష్ణుడు ఇష్టపడే రాశి కనుక ఆయన తన భక్తులకు అదృష్టాన్ని ప్రసాదిస్తాడని భావిస్తారు. సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవించేలా చేస్తాడమని విశ్వాసం. ఇంకా మురళీ కృష్ణుడు ఈ రాశికి చెందిన వ్యక్తుల కష్టాలను తొలగించి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తాడని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

సింహరాశి: వీరు తమ లక్ష్యం పట్ల అంకితభావంతో ఉంటాని.. గంభీరంగా కనిపిస్తారని నమ్మకం. ఈ గుణాలే ఈ రాశికి వారిని శ్రీకృష్ణుడికి ఇష్టమయ్యేలా చేశాయట. వీరి జీవితాలను ఆనందం, విజయంతో సాగిపోయేలా కృష్ణుడు ఆశీర్వదిస్తాడు. శ్రీకృష్ణుడు తన భక్తులు వారి శ్రమకు తగిన ఫలాలను పొందేలా చూస్తాడు. ఈ సింహరాశి వారు తమ జీవితంలోని అన్ని అంశాలలో విజయం సాధిస్తారని.. సమాజంలో మంచి గుర్తింపును సొంతం చేసుకుంటారని నమ్మకం.

తులారాశి: ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం శ్రీ కృష్ణుడు కూడా తులారాశి వారి పట్ల ప్రేమతో ఉంటాడు. అందుకే వీరి జీవితాల్లో కృష్ణుడు ఎక్కువ సమతుల్యత , సామరస్యాన్ని తెస్తాడని భావిస్తారు. శ్రీకృష్ణుడిని ఆరాధించడం వల్ల మీ జీవితంలో ఆర్ధిక ఇబ్బందులు తలెత్తవు. మంచి గుర్తింపు లభిస్తుంది. శ్రీ కృష్ణుడితో లోతైన సంబంధాన్ని ఏర్పరచుకునే తులారాశి వారి జీవితం సామరస్యపూర్వకంగా సాగుతుంది.

అయితే జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇక్కడ సమాచారం ఇచ్చినది. అయితే శ్రీకృష్ణుని ఆదరాన్ని ఈ రాశులు ఖచ్చితంగా పొందుతాయనే హామీ లేదని గమనించాలి. అయితే ఎవరైనా ఈ రాశులలో ఒకదానిలో జన్మించినట్లయితే.. వారు సహజంగా కృష్ణుడి పట్ల ఆరాధన, అయన బోధనలతో అనుబంధాన్ని కలిగి ఉన్నారని..ఆయనని అత్యంత భక్తిశ్రద్దలతో ఆరాదిస్తున్నారని అంటున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు