World Heritage Sites in India: మన దేశంలో యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వం ప్రదేశాలు ఎన్ని? ఎక్కడ ఉన్నాయో తెలుసా..
చారిత్రక. సాంస్కృతిక ప్రదేశాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు తెలియజేయడానికి..వారసత్వ ప్రదేశాలను రక్షించాల్సిన అవసరం గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1199 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి .అయితే మన దేశంలోని కొన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో చారిత్రక, సాంస్కృతిక, శాస్త్రీయ, సహజ ప్రాముఖ్యత కలిగిన అనేక ప్రదేశాలు ఉన్నాయి. ఇటువంటి అద్భుతమైన ప్రదేశాలను రక్షించే బాధ్యత యునెస్కోదే. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1199 ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి . ఈ స్మారక చిహ్నాలు, గతాన్ని చెప్పే ప్రదేశాల గురించి ప్రస్తుత తరానికి తెలియజేయడానికి.. ఈ అద్భుతమైన వారసత్వ పరిరక్షణ, వారసత్వ ప్రదేశాల ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవం జరుపుకుంటున్నాం కూడా. ఈ రోజు మన దేశంలో యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వం ప్రదేశాల గురించి తెలుసుకుందాం..
మన దేశంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఇవే:
- భారతదేశం దాని గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, సహజ సౌందర్యంతో మొత్తం 43 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలను కలిగి ఉంది.
- ఆగ్రా కోట: ఎర్రకోట అని కూడా పిలువబడే ఈ కోట ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా నగరంలో ఉంది. 1983లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
- అజంతా గుహలు: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న అజంతా గుహలు.. అనేక రహస్యాలను అద్భుతాలను కలిగి ఉన్నాయి. వీటిని 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చింది.
- ఎల్లోరా గుహలు: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ ఎల్లోరా గుహలను కూడా 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు.
- తాజ్ మహల్: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో నిర్మించబడిన తాజ్ మహల్, యమునా నది ఒడ్డున ఉంది. 1983లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
- మహాబలిపురంలోని స్మారక చిహ్నాలు: పల్లవ రాజులు నిర్మించిన ఈ దేవాలయాల సముదాయాన్ని 1984 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
- సూర్య దేవాలయం, కోణార్క్: గొప్ప నిర్మాణ శైలితో అలరించే కోణార్క్ సూర్య దేవాలయం తూర్పు భారత రాష్ట్రమైన ఒరిస్సాలో ఉంది. 1984లో యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
- కాజీరంగా జాతీయ ఉద్యానవనం: అస్సాంలో ఉన్న ఈ పార్క్ లో ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలు ఎక్కువగా కనిపిస్తాయి. 1985 లో యునెస్కో ఈ కాజీరంగా జాతీయవనాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
- హంపిలోని స్మారక చిహ్నాలు: కర్ణాటకలోని చారిత్రాత్మక ప్రదేశం అయిన హంపిని 1986లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
- పట్టడకల్: కర్ణాటకలోని ఒక చిన్న గ్రామం. చాళుక్య రాజవంశం పాలనలో నిర్మించబడిన ఈ కట్టడాలు భారతీయ వాస్తుకళా అద్భుతంగా ఆ కాలపు గొప్ప నిర్మాణ శైలికి నిదర్శనంగా నిలుస్తాయి. ఈ స్థలాన్ని 1987 లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
- సాంచి బౌద్ధ స్థూపం: మధ్యప్రదేశ్‌లోని రైసేన్ జిల్లాలోని సాంచి వద్ద ఉన్న బౌద్ధ స్థూపాన్ని 1989లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
- కుతుబ్ మినార్, ఢిల్లీ: 13వ శతాబ్దంలో ఢిల్లీలో నిర్మించబడిన కుతుబ్ మినార్‌ను 1993లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.
- కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయం , తెలంగాణ: శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం 13వ శతాబ్దం మొదటి భాగంలో కాకతీయ రాజవంశం పాలనలో నిర్మించబడింది.
- లేపాక్షి ఆంధ్రప్రదేశ్: ఈ ఆలయ నిర్మాణం 1100 ప్రాంతంలో ప్రారంభమైంది.. విజయనగర సామ్రాజ్య కాలంలో 1350 నుంచి 1600 వరకు ఒక పెద్ద ఆలయ సముదాయం నిర్మించబడింది.
వీటితో పాటు, మధ్యప్రదేశ్‌లోని ఖజురహో దేవాలయాలు, ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సిక్రీ, పశ్చిమ బెంగాల్‌లోని సుందర్‌బన్స్ జాతీయ ఉద్యానవనం, ఉత్తరాఖండ్‌లోని నందాదేవి జాతీయ ఉద్యానవనం, కియోలాడియో జాతీయ ఉద్యానవనం, గోవాలోని చర్చిలు, కాన్వెంట్లు, ఖజురహోలోని స్మారక చిహ్నాలు, ఎలిఫెంటా గుహలు, హుమాయున్ సమాధి, ఛత్రపతి శివాజీ టెర్మినస్ (విక్టోరియా టెర్మినస్), జంతర్ మంతర్, పశ్చిమ కనుమలు, రాజస్థాన్‌లోని కొండ కోటలు, నలంద విశ్వవిద్యాలయం, శాంతినికేతన్ అన్నీ మన భారతదేశంలోని ముఖ్యమైన యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




