AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liver Health: ఈ తప్పులు చేస్తున్నారా..? ఇక మీ లివర్ షెడ్డుకేనట.. ఇలా చేస్తే ఆ వ్యాధికి చెక్ పెట్టినట్టే..

ఈ ప్రపంచ కాలేయ దినోత్సవం నాడు.. మంచి ఆహారం.. అత్యంత ప్రభావవంతమైన ఔషధం అని మనం అర్థం చేసుకోవాలి. మనం చక్కెరతోపాటు ప్రాసెస్ చేసిన అలాగే జంక్ ఫుడ్ కు దూరంగా ఉండి, సహజమైన ఆహారాన్ని తీసుకుంటే, కాలేయ వ్యాధిని నివారించడమే కాకుండా మన మొత్తం ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చు. లివర్ హెల్త్ గురించి ఎలాంటి ఆహారం తీసుకోవాలి..? నిపుణులు ఏం చెబుతున్నారు ఈ వివరాలను తెలుసుకుందాం..

Liver Health: ఈ తప్పులు చేస్తున్నారా..? ఇక మీ లివర్ షెడ్డుకేనట.. ఇలా చేస్తే ఆ వ్యాధికి చెక్ పెట్టినట్టే..
Liver Health Tips
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 19, 2025 | 1:00 PM

నేటి బిజీ జీవితంలో మనం తరచుగా మన ఆహారపు అలవాట్లపై శ్రద్ధ చూపము.. కానీ.. అవే పలు సమస్యల బారిన పడేలా చేస్తాయి.. అయితే.. నేడు మన ఆహారపు అలవాట్లను మెరుగుపరుచుకుంటే, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని 50% తగ్గించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. శరీరంలో కాలేయం ముఖ్యమైన అవయవం.. ఇది ఎన్నో విధులను నిర్వహిస్తుంది.. కాలేయ (లివర్) ఆరోగ్యం గురించి అవగాహన కల్పించేందుకు ఏటా ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సంవత్సరం 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం ఉద్దేశం.. “ఆహారమే ఔషధం”.. ఇది మనం తినే ఆహారం కడుపు నింపుకోవడానికి మాత్రమే కాదు, మన ఆరోగ్యానికి నిజమైన రక్షకుడని ఆలోచించేలా చేస్తుంది.

కాలేయ వ్యాధులు – మన జీవితం..

కాలేయం మన శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం.. ఇది 500 కంటే ఎక్కువ విధులను నిర్వహిస్తుంది. ఇది మన శరీరాన్ని డీటాక్సిఫై చేయడమే కాకుండా, జీర్ణక్రియ, జీవక్రియ, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. కానీ సరైన ఆహారం లేకపోవడం, ప్రాసెస్ చేసిన ఆహారం, మద్యం, పేలవమైన జీవనశైలి దాని ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి.

మన ఆహారంలో మార్పులు చేసుకుంటే, కాలేయ వ్యాధి ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. మీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లను చేర్చుకోవడం ద్వారా, కాలేయాన్ని మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. కాలేయం తనను తాను నయం చేసుకునే అద్భుతమైన శక్తిని కలిగి ఉందని, దానికి కావలసిందల్లా సరైన ఆహారం, జీవనశైలి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే కాలేయ వ్యాధులు..

నేడు, కాలేయ వ్యాధులు మద్యం సేవించేవారికి మాత్రమే పరిమితం కాలేదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇప్పుడు ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక చక్కెర ఆహారం కూడా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కు కారణమవుతున్నాయి. ఫ్రాంటియర్స్ ఇన్ న్యూట్రిషన్ జర్నల్‌లో ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనంలో, శోథ నిరోధక ఆహారం తినే వ్యక్తులు అంటే, వాపును పెంచే ఆహారాలు.. దీర్ఘకాలిక కాలేయ వ్యాధి (CLD) అభివృద్ధి చెందే ప్రమాదం 16% ఎక్కువగా ఉందని కనుగొన్నారు.

పిల్లలలో కూడా పెరుగుతున్న ప్రమాదం..

నేటి పిల్లలలో కూడా కాలేయ సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు, తీపి పానీయాలలో లభించే ఫ్రక్టోజ్ ఊబకాయం ఉన్న పిల్లలలో కొవ్వు కాలేయ వ్యాధి (MASLD) కు దారితీస్తుందని న్యూట్రియంట్స్ జర్నల్‌లో జరిగిన ఒక పరిశోధన సూచిస్తుంది. దీని వలన తల్లిదండ్రులు పిల్లలకు తాజా, ఇంట్లో వండిన ఆహారాన్ని ఇవ్వడం, స్వీట్లు మరియు ప్యాక్ చేసిన స్నాక్స్‌కు దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.

అవగాహన – పోషకాహారం..

ప్రతి ముగ్గురిలో ఒకరికి ఇప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం ఉందని లివర్ నిపుణులు చెబుతున్నారు. అయితే శుభవార్త ఏమిటంటే ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా నివారించవచ్చు. పోషకమైన, ఇంట్లో వండిన భోజనం తినడం, హైడ్రేటెడ్ గా ఉండటం, మితంగా తినడం, వ్యాయామం చేయడం, మద్యపానానికి దూరంగా ఉండటం వంటివి నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..