AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chilli Potato Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో స్పైసీ చిల్లీ పొటాటో తయారు చేసుకోండి.. తింటుంటే ముక్క ముక్కకీ కిక్కే..

బంగాళాదుంపలను పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఇష్టంగా తింటారు. ఈ బంగాళా దుమ్పలతో రకరకాల కూరలు, వంటలను తయారు చేస్తారు. అంతేకాదు స్నాక్స్ ని కూడా తయారు చేసుకోవచ్చు. ఇలా బంగాళా దుంపతో బజ్జీలు వంటి స్నాక్స్ మాత్రమే కాదు ఫ్రెంచ్ ప్రైస్, చిల్లీ పొటాటో వంటి వాటిని కూడా చేస్తారు. అయితే వీటిని తినాలంటే రెస్టారెంట్ కు వెళ్ళాల్సిందే అనుకుంటున్నారా.. అయితే ఈ రోజు రెస్టారెంట్ స్టైల్ లో స్పైసీ చిల్లీ పొటాటో రెసిపీ గురించి తెలుసుకుందాం..

Chilli Potato Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో స్పైసీ చిల్లీ పొటాటో తయారు చేసుకోండి.. తింటుంటే ముక్క ముక్కకీ కిక్కే..
Chilli Potato Recipe
Surya Kala
|

Updated on: Apr 19, 2025 | 10:17 AM

Share

దేశీ -చైనీస్ వంటకం అనేది భారతీయ అభిరుచులు.. సుగంధ ద్రవ్యాలకు అనుగుణంగా తయరు చేసే చైనీస్ వంటకం. అంటే భారతీయ రుచులకు అనుగుణంగా చైనా స్టైల్ లో తయారు చేసే ఒక విభిన్న శైలి. ఇలా ఇండో చైనీస్ వంటకాల్లో స్టార్టర్స్, స్నాక్స్, ఫ్రైడ్ రైస్, నూడుల్స్ వంటివి ఉన్నాయి. వీటిల్లో స్పైసీ చిల్లీ పొటాటో స్టార్టర్స్ అంటే అందరికీ ఇష్టమే. వీటిని తినాలంటే ఎక్కువ మంది రెస్టారెంట్ కు వెళ్ళాలనుకుంటారు. మీరు ఇండో-చైనీస్ ఫుడ్ తినడానికి ఇష్టపడితే, చిల్లీ పొటాటో ఖచ్చితంగా మీ జాబితాలో ఉంటుంది. ఇది క్రిస్పీ బంగాళాదుంప ముక్కలు.. కారంగా, తీపి రుచులతో అద్భుతమైన కలయిక. మీరు ఇంట్లో రెస్టారెంట్ స్టైల్ లో చిల్లీ పొటాటోను సులభంగా తయారు చేసుకోవచ్చు.. కనుక ఈ అందమైన సాయంత్రం చిల్లీ పొటాటోతో సందడి చేద్దాం..

కావాల్సిన పదార్ధాలు

  1. బంగాళాదుంపలు – 4 నుంచి 5 మీడియం సైజు
  2. కార్న్‌ఫ్లోర్ – 3 టేబుల్ స్పూన్లు
  3. మైదా పిండి – 1 టేబుల్ స్పూన్
  4. కారం – 1/2 స్పూన్
  5. ఇవి కూడా చదవండి
  6. ఉప్పు – రుచికి సరిపడా
  7. నూనె – వేయించడానికి
  8. ఉల్లిపాయ – 1/2 కప్పు (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  9. క్యాప్సికమ్ – 1/2 కప్పు (ముక్కలుగా కట్ చేసుకోవాలి)
  10. పచ్చిమిర్చి – 1-2 (సన్నగా తరిగినవి)
  11. అల్లం – 1 అంగుళం (సన్నగా తరిగినది)
  12. వెల్లుల్లి – 4-5 రెబ్బలు (సన్నగా తరిగినవి)
  13. సోయా సాస్ – 1 టేబుల్ స్పూన్
  14. రెడ్ చిల్లీ సాస్ – 1 టేబుల్ స్పూన్
  15. టమాటా కెచప్ – 2 టేబుల్ స్పూన్లు
  16. వెనిగర్ (సిర్కా) – 1 టీస్పూన్
  17. పంచదార – 1/2 టీస్పూన్ (ఇష్టమైతే)
  18. స్ప్రింగ్ ఆనియన్స్ (ఉల్లి ఆకులు) – అలంకరణ కోసం

తయారు చేసే పధ్ధతి:

  1. ముందుగా బంగాళాదుంపలను సిద్ధం చేయండి: బంగాళాదుంపలను తొక్క తీసి పొడవుగా.. మందంగా వేళ్ల ఆకారంలో కట్ చేసుకోండి. వీటి మీద ఉన్న అదనపు స్టార్చ్ తొలగించడానికి కట్ చేసిన బంగాళా దుంపల ముక్కలను చల్లటి నీటిలో 15 నుండి 20 నిమిషాలు నానబెట్టండి.
  2. పిండి మిశ్రమం : నీటి నుంచి బంగాళాదుంప ముక్కలు తీసి ఒక క్లాత్ మీద వేసి బాగా ఆరబెట్టండి. ఒక గిన్నెలో కార్న్‌ఫ్లోర్, మైదా, కారం, ఉప్పు వేసి బాగా కలపండి. బంగాళాదుంప ముక్కలను వేసి ఈ మిశ్రమంలో ముంచి బాగా అప్లై చేయండి. అవసరమైతే బంగాళా దుంప ముక్కలకు ఈ మిశ్రమం అడ్డుకునేలా కొంచెం నీరు చల్లుకోవచ్చు.
  3. బంగాళాదుంపలను వేయించండి: ఒక పాన్‌లో నూనె వేడి చేసి.. బంగాళాదుంప ముక్కలను మీడియం మంట మీద బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. వేయించిన బంగాళాదుంపలను ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి.
  4. సాస్ తయారు చేసుకోండి: ఒక పాన్ లో కొంచెం నూనె వేసి వేడి చేసి.. అందులో సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి వేసి వేయించండి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా మెత్తబడే వరకు వేయించాలి.
  5. కూరగాయలు వేయండి: ఈ ఉల్లిపాయ మిశ్రమంలో ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించండి. అవి కొద్దిగా క్రంచీగా మారేంత వరకూ వేయించాలి
  6. సాస్ జోడించండి: ఉల్లిపాయలు, క్యాప్సికమ్ ముక్కలు వేగిన అనంతరం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టొమాటో కెచప్, వెనిగర్ , చక్కెర (ఉపయోగిస్తుంటే) వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంట మీద 2 నిమిషాలు ఉడికించాలి.
  7. బంగాళాదుంపలను కలపండి: వేయించిన బంగాళాదుంప ముక్కలను సాస్‌లో వేసి బాగా కలపండి.. తద్వారా సాస్ బంగాళాదుంపలు బాగా కలుస్తాయి. రెండు నిముషాలు ఉంచి ఒక ప్లేట్ లోకి తీసుకోండి.
  8. అలంకరించి సర్వ్ చేయండి: ప్లేట్ లోకి స్పైసీ చిల్లీ పొటాటోని తీసుకుని దానిని ఉల్లి ఆకులతో అలంకరించి.. నిమ్మకాయ ముక్క పెట్టి.. హాట్ హాట్ స్పైసీ చిల్లీ పొటాటోను సర్వ్ చేయండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..