- Telugu News Photo Gallery Amazing health benefits of eating cloves and drinking clove water on an empty stomach in telugu
Summer Health Tips: లవంగాలను రోజూ ఇలా తీసుకోండి.. ప్యాటీ లివర్ సహా ఎన్ని సమస్యలను నివారిస్తుందో తెలుసా..
వేసవి సీజన్ లో రకరకాల వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఖాళీ కడుపుతో లవంగాలు తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీనివల్ల గ్యాస్ సమస్య, అపానవాయువు, విరేచనాలు, వాంతులు, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. లవంగాలు శరీర రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతాయి. లవంగాలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. కనక వీటిని తినడం వలన సీజనల్ ఫ్లూ నుంచి రక్షణ లభిస్తుంది.
Updated on: Apr 19, 2025 | 8:13 AM

ఆయుర్వేదంలో ఉపయోగించే మూలికలు ప్రకృతి ప్రసదితలే అధికంగా ఉన్నాయి. వీటిని ఖాళీ కడుపుతో తింటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారం ప్రభావం రోజంతా ఉంటుంది. వీటిలో ఒకటి లవంగం. దీనిని ఖాళీ కడుపుతో తింటే రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. ఎందుకంటే లవంగాల్లో అనేక ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. కనుక లవంగాలు మన శరీరానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతున్నాయి. ఉదయం ఖాళీ కడుపుతో లవంగాలను నమలడం వల్ల కడుపుకు చాలా మేలు జరుగుతుంది. ఖాళీ కడుపుతో లవంగాలు తినడం వల్ల శరీరంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి.

నిపుణుల అభిప్రాయం ప్రకారం కడుపులో పురుగులు ఉన్నవారు ఖాళీ కడుపుతో లవంగాలు తినాలి లేదా నమలాలి. ఇలా చేయడం వలన దీని ఉపయోగం కొన్ని రోజుల్లో కనిపించడం ప్రారంభమవుతుంది. దీనితో పాటు లవంగాల వినియోగం శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది అజీర్ణం, గ్యాస్ , కడుపు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఎముకలను బలంగా ఉంచడంలో ఇది ప్రయోజనకరం: ఆయుర్వేదం ప్రకారం లవంగాలు తినడం వల్ల పంటి నొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాదు లవంగా నూనె వాడటం వల్ల తలనొప్పి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. లవంగాలలో విటమిన్ సి లభిస్తుంది. ఇది తెల్ల రక్త కణాలను పెంచడానికి పనిచేస్తుంది. ఎవరికైనా ఎముకలు బలహీనంగా ఉంటే రెండు లవంగాలు నమలడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. లవంగాలు తినడం వల్ల ఎముకలు కూడా బలపడతాయి.

రోగనిరోధక శక్తి పెంపు: లవంగాలలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్‌ను నయం చేయడానికి కూడా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల మొత్తం ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి.

ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది: లవంగాలు శరీరంలోని ఇన్ఫెక్షన్లను తొలగించడంలో సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయి. కనుక ఎవరికైనా కడుపు లేదా గొంతులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే.. లవంగాలను వేడి చేసి లేదా పచ్చిగా తినవచ్చు. లేదా లవంగాలను నీటిలో వేసి కాచి.. ఆ వేడి నీటిని కూడా తీసుకోవచ్చు.

ఆరోగ్యకరమైన కాలేయం: లవంగాలు తినడం వల్ల కాలేయం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది మీ శరీరాన్ని నిర్విషీకరణ చేయడమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఫ్యాటీ లివర్ తో బాధపడేవారు నిపుణుల సలహా మేరకు రోజూ లవంగం నీరు త్రాగాలి లేదా నమలాలి.

లవంగాలు తినడం వల్ల ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు ఉత్పత్తి: లవంగాలు తినడం వల్ల కడుపులో ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇది జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఎంజైములు గ్యాస్, ఉబ్బరం తగ్గించడంలో సహాయపడతాయి. ఇది మాత్రమే కాదు.. లవంగాలు కడుపు పూతల నుంచి కూడా రక్షిస్తుంది. అలాగే ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధక సమస్యను తొలగిస్తుంది.




