AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: భర్తలూ జాగ్రత్త! ఈ 4 విషయాలను మీ భార్యతో చెప్పరా.. గొడవలకు మీరే కారణం అవుతారు..

ఆచార్య చాణక్యుడు తక్షశిలలో అధ్యాపకుడిగా పనిచేశాడు. ఆయన మంచి రాజనీతి వేత్త, తత్వవేత్త, తెలివైన వ్యక్తీ. మనిషి జీవితం గురించి ఆయన చెప్పిన విషయాలు భావితరాలకు అనుసరణీయం. కొన్ని వందల ఏళ్ళు గడిచినా నేటికీ సమాజంలో అయనని మంచి గురువుగా భావిస్తారు. గౌరవిస్తారు. ఆయన రచించిన నీతి శాస్త్రంలోని విషయాలను అనుసరిస్తారు. ఈ రోజు భార్య భర్తలకు సంబంధించి చాణుక్యుడు చెప్పిన విషయాలను గురించి తెల్సుకుందాం..

Chanakya Niti: భర్తలూ జాగ్రత్త! ఈ 4 విషయాలను మీ భార్యతో చెప్పరా.. గొడవలకు మీరే కారణం అవుతారు..
Chanakya NitiImage Credit source: social media
Surya Kala
|

Updated on: Apr 19, 2025 | 8:53 AM

Share

మన సమాజంలో ఆచార్య చాణక్యుడికి ప్రత్యేక గౌరవం, ప్రాముఖ్యత ఉంది. అన్ని కాలాలలో, కొన్ని పరిస్థితులలో ప్రజలు ఎలా ప్రవర్తిస్తారో చాణక్యుడు అంచనా వేసి నీతి శాస్త్రం రచించాడు. ప్రస్తుత ప్రపంచంలో కూడా ఆయన మనుషుల తీరు గురించి చెప్పిన విషయాలు నిజమే అనిపిస్తాయి. అందుకనే ఏదైనా ముఖ్యమైన జీవిత నిర్ణయం తీసుకునే ముందు చాణక్య నీతిని చదవడం మనలో కొంతమందికి అలవాటు. ఈ రోజు భార్యాభర్తల బంధం సుఖ సంతోషాలతో సాగాలంటే ఎలా ఉండాలో చెప్పిన విషయాలను గురించి తెలుసుకుందాం..

భర్త భర్తల మధ్య దాపరికం ఉండకూడదు అని చెబుతారు.. అయితే చాణక్య నీతిలో భర్త భర్తల బంధానికి సంబంధించిన మరొక నిబంధన కూడా ఉంది. అదేమిటంటే భర్త తన భార్యకు కొన్ని విషయాలను చెప్పవద్దు అని చెప్పాడు. మౌనంగా ఉండడం అన్నివిధాలా మేలు అని సూచించాడు. దీని అర్థం ఏమిటంటే భార్తభర్తల బంధంలో చీలికకు కారణమయ్యే ఏదైనా విషయాన్ని ఒకరుతో ఒకరు పంచుకోకూడదు. భార్యతో భర్త చెప్పకూడని విషయాలు ఏమిటంటే..

సంపాదన గురించి భార్యకు చెప్పవద్దు: భర్త తన జీతం లేదా సంపాదన గురించి పూర్తి సమాచారాన్ని భార్యకు చేపవద్దు. ఒకవేళ భర్త సంపాదన గురించి భార్యకు తెలిస్తే.. ఆమె చేసే ఖర్చులకు అదుపు ఉండదని చాణక్య పేర్కొన్నాడు. భర్త తన సంపాదనని అవసరానికి అనుగుణంగా ఖర్చు చేసి..మిగిలిన డబ్బుని రకరకాలుగా పొడుపు చేస్తారు. అయితే భార్య అనవసరంగా ఖర్చు చేయడంతో భర్త చేసే పొదుపుకి ఇబ్బందులు ఏర్పడవచ్చు. లేదా భార్య అనవసరంగా ఖర్చు చేయడం భర్తకు ఇష్టం ఉండకపోవచ్చు. ఈ వైఖరి దంపతుల మధ్య సమస్యలకు, చీలికలకు దారితీయవచ్చు. కనుక భర్త తన సంపాదన గురించి చెప్పే తప్పుడు జాగ్రత్తగా ఉండండి.

ఇవి కూడా చదవండి

దానం, విరాళాలు: భర్త తన సంపాదనలో కొంత మొత్తం దానం, విరాళాలు వంటి పనుల చేస్తుంటే.. ఇలాంటి దాతృత్వ కార్యక్రమాల గురించి భర్త.. తన భార్యతో చర్చించకపోవడం చాలా ముఖ్యం. భర్త తాను ఎవరికీ ఎంత విరాళం ఇచ్చాడో, ఎక్కడ విరాళం ఇచ్చాడో వంటి సమాచారాన్ని భార్య నుంచి దూరంగా ఉంచండి. మీ భార్యకు మీరు చేసే దానం గురించి చెబితే అది పనికిరానిది అవుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా దానం చేయడం మంచి ఆలోచన అని భర్త అనుకోకపోవచ్చు. భర్త చేసే దానాలను నిలిపివేసే అవకాశం కూడా ఉండవచ్చు.

బలహీనతలను బయటపెట్టకూడదు: భర్త తన బలహీనతలను తన భార్యకు చెప్పకూడదు. మీ భార్య మీ రహస్యాన్ని తన తల్లికి, సోదరికి లేదా తన సన్నిహిత స్నేహితుడికి చెప్పవచ్చు. ఈ సందర్భంలో భర్త ఇబ్బందుల్లో పడతారు పేరు కూడా అనవసరంగా దెబ్బతింటుంది. అంతేకాదు భర్త బలహీనతను గుర్తుచేస్తూ.. అప్పుడప్పుడు భార్య అవమానాలను గురి చేసే అవకాశం ఉంది. కనుక మీకు సంబంధించిన విషయలు ఏదైనా ప్రజలకు తెలియకూడదనుకుంటే.. ముందు మీ భార్యకు అసలు చెప్పకూడదు అని చాణక్య చెప్పాడు.

ఏదైనా సమస్యలో చిక్కుకుంటే: జీవితంలో ఏదైనా తీవ్రమైన వివాదంలో చిక్కుకున్నా దానిని తన భార్యకు చెప్పకూడదు. భార్య దృష్టిలో భర్త అసమర్దుడు.. అప్పుడు భర్తని ఎగతాళి చేయవచ్చు. భర్త ఏదైనా సమస్యలో ఉంటే.. వాటి పరిష్కారాలను భార్యతో కలిసి వేదకకండి. వాటిని భర్తే పరిష్కరించడానికి ప్రయత్నించండి లేదా ఏమీ జరగనట్లు ప్రవర్తించండి. భర్త సొంతంగా సమస్యలను పరిష్కరించలేకపొతే భార్య తానే తెలివైన దానిని అనుకోవచ్చు. సమస్యను ఎలా పరిష్కరించాలో భర్తకు భార్య కొన్ని సలహాలు ఇవ్వవచ్చు. అప్పుడు భర్త అహం దెబ్బతింటే .. భార్తభార్తల బంధానికి బీటలు పడే అవకాశం ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు