AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baba Vanga: వార్తల్లో బాబా వంగా అంచనా నిజమవుతుందా? ముస్లిం పాలనలోకి వెళ్లనున్న 44 దేశాలు.. ఎక్కడంటే..

ప్రముఖ బల్గేరియన్ ప్రవక్త బాబా వంగా ప్రపంచంలో జరగనున్న అనేక సంఘటనలను ముందే అంచనాలు వేశారు. వాటిలో కొన్ని నిజమని నిరూపించబడ్డాయి. ఉదాహరణకు సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, 9/11 ఉగ్రవాద దాడులు. ఇటీవల బాబా వంగా వేసిన ఒక అంచనా చర్చలో నిలిచింది. అందులో 2043 నాటికి యూరప్‌లోని అనేక దేశాలలో ముస్లిం పాలన స్థాపించబడుతుందని బాబా వంగా పేర్కొన్నారు.

Baba Vanga: వార్తల్లో బాబా వంగా అంచనా నిజమవుతుందా? ముస్లిం పాలనలోకి వెళ్లనున్న 44 దేశాలు.. ఎక్కడంటే..
Baba Vanga
Surya Kala
|

Updated on: Apr 19, 2025 | 12:43 PM

Share

బాబా వంగా ప్రపంచంలో జరిగే అనేక విషయాలను అంచనా వేశారు. ఆమె వేసిన అంచనాలు నిజం అవ్వడంతో ప్రస్తుతం కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది. అని ఆలోచిస్తూ ఉంటారు. అటువంటి అంచనాలలో ఒకటి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. 2043 నాటికి ముస్లిం సమాజం యూరప్‌లో గొప్ప రాజకీయ శక్తిగా రూపొందుతుందని పేర్కొంది. 2025 నుంచి యూరప్‌లో ఒక పెద్ద సంఘర్షణ ప్రారంభమవుతుందని.. అది వినాశనానికి దారితీస్తుందని ఆమె అంచనా. ఈ సంఘర్షణ ఫలితంగా.. 2043 నాటికి యూరప్‌లోని అనేక దేశాలలో ముస్లిం పాలన ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ అంచనాతో ప్రత్యేకంగా యూరప్‌లోని 44 దేశాలపై దృష్టి పెట్టేటట్లు చేసింది. అయితే ఇందులో ఏ ఆసియా దేశం గురించి ప్రస్తావన లేదు. ఈ జోస్యం నిజమవుతుందో లేదో ఎవరికి తెలియదు. అయితే ఇప్పటికీ బాబా వంగా ఒక ఆసక్తికరమైన, మర్మమైన వ్యక్తిత్వంగా మిగిలిపోయింది. ఆమె అంచనాలు ఇప్పటికీ ప్రజలను ఆకర్షిస్తూనే ఉన్నాయి.

బాబా వంగా ఎవరు?

బాబా వంగా.. అసలు పేరు వాంజెలియా పాండేవా డిమిట్రోవా. ఒక బల్గేరియన్ మహిళ. ఆమె ఒక ఆధ్యాత్మికవేత్త, ప్రవక్తగా ప్రసిద్ధి చెందింది. ఆమె జనవరి 31, 1911న ఇప్పుడు ఉత్తర మాసిడోనియాలో ఉన్న స్ట్రుమికాలో జన్మించింది. ఆగస్టు 11, 1996న బల్గేరియాలోని సోఫియాలో మరణించింది. బాబా వంగా తన బాల్యంలో ఒక సంఘటనలో తన దృష్టిని కోల్పోయింది. ఈ సంఘటన తర్వాత ఆమె భవిష్యత్తును చూసే సామర్ధ్యం లభించిందని నమ్మకం. ఆమె తన జీవితకాలంలో అనేక అంచనాలు వేసింది. వాటిలో కొన్ని నిజం అయ్యాయని అనుచరులు భావిస్తారు. వీటిలో రెండవ ప్రపంచ యుద్ధం.. చెర్నోబిల్ విపత్తు, 9/11 దాడులు, యువరాణి డయానా మరణం వంటి ప్రధాన సంఘటనలు ఉన్నాయి. ఈ సంఘటనలు ప్రపంచాన్ని కుదిపివేసాయి. అందుకే బాబా వంగా చెప్పిన ఈ అంచనాలు నిజం అవ్వడంతో ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఇవి కూడా చదవండి

బాబా వంగా మాత్రమే కాదు నోస్ట్రాడమస్ వంటి అనేక మంది ప్రసిద్ధ ప్రవక్తలు ఉన్నారు.

16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు, వైద్యుడు, బాబా వంగా వేసిన అంచనాలతో ప్రసిద్ధి చెందింది. ఆమె పుస్తకం “లెస్ ప్రొఫెటీస్”లో పద్యాల (క్వాట్రైన్లు) రూపంలో రచించింది. ఆమె ప్రవచనాలు తరచుగా అస్పష్టంగా, ప్రతీకాత్మకంగా పరిగణించబడతాయి. ఆమె అంచనాల్లో లండన్‌లోని మహా అగ్నిప్రమాదం, ఫ్రెంచ్ విప్లవం, నెపోలియన్ పెరుగుదల, హిట్లర్ పెరుగుదల, 9/11 దాడులు వంటి అనేక చారిత్రక సంఘటనలను అంచనా వేసింది.

ఎడ్గార్ కేస్

20వ శతాబ్దపు అమెరికన్ ఆధ్యాత్మికవేత్త.. “స్లీపింగ్ ప్రవక్త” అని పిలుస్తారు. అతను ట్రాన్స్ లాంటి స్థితిలో ఆరోగ్యం, పునర్జన్మ, అట్లాంటిస్, భవిష్యత్తు సంఘటనలకు సంబంధించిన ప్రవచనాలు చేసినట్లు చెబుతారు. ఆయన చెప్పిన అనేక అంచనాలు నిజమయ్యాయని ఆయన అనుచరులు నమ్ముతారు.

డేనియల్ డంగ్లాస్ హోమ్ 19వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ ఆధ్యాత్మిక మాధ్యమం. దెయ్యాలతో సంభాషిస్తానని, భవిష్యత్తును అంచనా వేస్తానని చెప్పుకున్నాడు.

జీన్ డిక్సన్ 20వ శతాబ్దపు అమెరికన్ జ్యోతిష్కుడు, ప్రవక్త, అనేక ప్రసిద్ధ అంచనాలు వేశారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు