బోర్డింగ్ పాస్, చెక్ ఇన్ అవసరం లేదు.. డిజిటల్ ట్రావెల్ క్రెడెన్షియల్స్ ఉందిగా..
విమాన ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్లాన్ చేసింది. ఆధునిక టెక్నాలజీతో ఫ్లైట్ సమాచారాన్ని ఆటోమేషన్ విధానంలో అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఐసీఏవో ఐక్యరాజ్యసమితికి చెందిన ప్రత్యేక సంస్థ . అంతర్జాతీయ స్థాయిలో పాలసీకి రూపకల్పన చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. మూడేళ్లలో డిజిటల్ క్రెడెన్షియల్స్ ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త విధానంతో ఫ్లైట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం ఫోన్‌లో అందుకుంటాడు ప్రయాణికుడు. దీంతొ ప్రయాణం ఎంతో సులభతరంగా మారుతుంది.
విమానం టికెట్ బుక్ చేస్తున్న సమయంలోనే ప్రయాణికుల ఫోన్ కి “జర్నీ పాస్” పంపిస్తారు. ఈ డిజిటల్ జర్నీ పాస్ విమానం టేకాఫ్ సమయానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఆటోమేటిగ్గా అప్‌డేట్స్ రూపంలో అందిస్తుంది. విమానాశ్రయంలోని ఫేషియల్ రికగ్నిషన్ స్కాన్ ప్రయాణికుడిని స్కాన్ చేసి అతని వివరాలను విమానసంస్థకి నేరుగా అందిస్తుంది. దీంతో డాక్యుమెంట్లు వెంటబెట్టుకు వెళ్లాల్సిన అవసరం పూర్తిగా తగ్గుతుంది. చెక్ ఇన్ అవసరం కూడా ఇకపై ఉండదు. ప్రపంచవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలలో కొత్తగా మొబైల్ పాస్‌పోర్ట్ రీడర్స్ ఇంకా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌లను ఏర్పాటుచేయనున్నారు. ప్రయాణికుల వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యత ఇస్తూ… ప్రతీ 15 సెకన్ల తర్వాత ఫేషియల్ రిక్నగిషన్ స్కాన్‌లు.. సమాచారాన్ని ఎరేజ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. డేటా భద్రతకు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
