AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Golden Pan: ఈ కిళ్లీ తింటే మీ నోరంతా బంగారం గానూ..! పసిడి పాన్ ధర తెలిస్తే షాక్!

దేశ వ్యాప్తంగా పసిడి పరుగులు తీస్తోంది. తగ్గేదేలే అంటూ రూ. లక్ష వైపు దూసుకెళ్తోంది. పట్టుకోండి చూద్దమంటూ కొండెక్కి కూర్చుకుంది. అయితే పసిడితో పాటు పాన్‌కు కూడా రెక్కలొచ్చాయి. పసిడి పరుగులు తీస్తుంటే.. నేనేమి తక్కువా.. నన్ను చూడంటి అంటూ మెరిసిపోతుంది. ఇంతకు పసిడికి.. పసిడికి పాన్‌కు పోటీ ఏమిటి..?

Golden Pan: ఈ కిళ్లీ తింటే మీ నోరంతా బంగారం గానూ..! పసిడి పాన్ ధర తెలిస్తే షాక్!
Golden Pan
Vasu Bathula
| Edited By: Balaraju Goud|

Updated on: Apr 19, 2025 | 6:07 PM

Share

దేశ వ్యాప్తంగా పసిడి పరుగులు తీస్తోంది. తగ్గేదేలే అంటూ రూ. లక్ష వైపు దూసుకెళ్తోంది. పట్టుకోండి చూద్దమంటూ కొండెక్కి కూర్చుకుంది. అయితే పసిడితో పాటు పాన్‌కు కూడా రెక్కలొచ్చాయి. పసిడి పరుగులు తీస్తుంటే.. నేనేమి తక్కువా.. నన్ను చూడంటి అంటూ మెరిసిపోతుంది. ఇంతకు పసిడికి.. పసిడికి పాన్‌కు పోటీ ఏమిటి..? బంగారంతో పోటీ పడుతున్నా బంగారు పాన్ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!

పసిడి పాన్.. దీన్నే బంగారం కిళ్లీ అంటారు.. సాధారణంగా దీనికి గురించి చాలా మందికి తెలికయపోవచ్చు. కానీ, డైలీ పాన్ తినేవారికి మాత్రం దీని డిమాండ్ ఏమిటో తెలుస్తుంది. పసిడి పాన్ పేరు చెబితే.. అమ్మో అంటూ నోరెళ్లబెడతారు. వారు అలా షాక్ అవ్వడానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది సాధారణ కిళ్లిలా కాదు.. బంగారు ఆభరణాల్లో గోల్డ్ రాజు అయితే.. పాన్ షాప్ లో ఇది రారాజు.. అందుకే దీనికి తెగ డిమాండ్ ఉంది. అప్పట్లో దీన్ని టేస్ట్ చేయాలంటే ఢిల్లీ దాకా వెళ్లాల్సి వచ్చేది. చాలా మంది ఏదో పనిమీద అక్కడికి వెళ్లినప్పుడు దీన్ని తినకుండా వచ్చేవారు కాదంటే అర్ధం చేసుకోవచ్చు దీని టేస్ట్ ఏమిటో.. అయితే ఇప్పుడు మన జంటనగరాల్లో కూడా ఈ గోల్డ్ పాన్ లభిస్తుంది.

డిమ్మి పాన్ షాప్.. ఇదిగో ఇక్కడే పసిడి పాన్.. అదేనండి గోల్డ్ పాన్ లభించేంది. ఇది జంటనగరాలలోని సికింద్రాబాద్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ఉంది.1975 సంవత్సరం నుంచే ఈ షాప్ రన్ అవుతుంది. ఈ ఒక్కో పాన్ ధర 500 రూపాయల నుంచి 5వేల వరకు ఉంటుంది. పాన్ ధర రూ. 5వేలా.. అని ఆశ్చర్యపోతున్నారా.. దీనికి ఇంతలా డిమాండ్ ఉండటానికి కారణం గోల్డ్ పూతతో చేయడమే. అయితే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా గోల్డ్ పూతతో తయారుచేసిన పేపర్ ను తెప్పిస్తారు. ఈ పాన్ ను తయారు చేయడం కత్తిమీద సామే.. గోల్డ్ పేపర్‌ను పాన్ మీద అందంగా డెకరేట్ చేస్తారు. దీన్ని పాన్ మీద అంటించాలంటే చాలా జాగ్రత్తలు పాటించాల్సిందే. కొంచెం మిస్ అయిన టేస్టే మరిపోతుందంటా..!

పాన్ పేరుకే కాదు.. నిజంగా ఇది మన శరీరానికి బంగారమే. ఇది కేవలం రుచి కోసమే కాదనీ, గొంతును మాయిశ్చరైజ్ చేస్తాయట. దానితో పాటు సీజనల్ ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచేందుకు ఈ పాన్ తోడ్పడుతుందట. అందుకే ఇంతటి విలువైన పాన్ లో సాఫ్రాన్, డ్రై ఫ్రూట్స్, రాజస్థానీ గుల్గాన్, ఫ్లేవర్ చట్నీస్ స్ట్రాబెరీ, రాబెరి చట్నీ వంటి పోషకాలను జత చేస్తారు. మరెన్నో ఇంగ్రిడియంట్స్ ఈ పాన్ లో కలుపుతారు. ఇకపోతే గోల్డ్ పాన్ ను పెళ్లిళ్లకు, నిశ్చితార్థ వేడుకలకు ఆర్డర్ పై డిమ్మి పాన్ షాప్ సప్లై చేస్తుంటారట.

ఇదిలా ఉంటే గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా నగరానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అజారుద్దీన్ తో కలిసి ఈ పాన్ షాప్ వద్దకు వచ్చి పసిడి పాన్ రుచి చూశారు. వారెవా పాన్ అంటూ కితాబిచ్చారంటే అర్ధం చేసుకోవచ్చు ఈ పాన్ షాప్.. గోల్డ్ పాన్ ప్రత్యేకత..!

వీడియో చూడండి..

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
పిల్లలు ఒంటరిగా కనిపిస్తే దాడే.. చిన్నారుల పాలిట యముడైన కుక్కలు
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..
మోటరోలా నుంచి అతి సన్నని స్మార్ట్‌ ఫోన్‌.. ప్రత్యేకతలు తెలిస్తే..