బి.వాసు తెలుగు మీడియాలో 14 ఏళ్లకు పైగా అనుభవం ఉంది..2011 సంవత్సరంలో విశాలాంధ్ర పేపర్ తో జర్నలిజంలో అడుగు పెట్టాను.. ఆ తరువాత ప్రముఖ మీడియా సంస్థలు 99 టీవీ, టీవీ5 లో పనిచేసే విలువైన సేవలు అందించాను.. 2019 సంవత్సరంలో టీవీ9 లో ఉమ్మడి ఖమ్మం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా జాయిన్ అయ్యాను.. ప్రస్తుతం హైదరాబాద్ లో tv9 సీనియర్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నాను..
మాయమవుతున్న వృక్షం.. అడిగేవాళ్లు లేరనా.. నరికినా ఎవరూ పట్టించుకోరనా..?
పచ్చని చెట్టు ప్రగతి మెట్టు, కానీ అదేంటి పచ్చని చెట్టు రోడ్డుకు అడ్డు.. అందుకే నరుకు.. అన్నట్టుగా చకా చకా నరికేసుకుంటూ పోతున్నారు. అడిగేవాళ్లు లేరనా.. నరికినా ఎవరూ పట్టించుకోరనా..? ఒక మొక్క చెట్టవ్వాలంటే ఏళ్లు పడుతుంది. కానీ ఇక్కడ చిటికేసినంత టైములో చెట్టంత చెట్టును అడ్డంగా నరికేస్తున్నారు. ఎందుకిలా అంటే అంతా మన అభివృద్ధి కోసమే అంటున్నారు అధికారులు. అభివృద్ధి అంటే విధ్వంసమా..? మనం డెవలప్ కావాలంటే చెట్టును నరకడమే ప్రత్యామ్నాయమా ? అసలు NH44 కర్నూల్ రోడ్డులో ఏం జరుగుతోంది..?
- Vasu Bathula
- Updated on: Aug 29, 2025
- 6:11 am
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్ మోగిస్తున్న బెంజిన్.. పీలిస్తే క్యాన్సర్ వస్తుందా..!
హైదరాబాద్ పరిస్థితి కూడా ఢిల్లీలా మారుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో రోజురోజుకు వాయుకాలుష్యం పెరిగిపోతుంది. అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. డేంజర్ బెల్ మోగిస్తున్న బెంజిన్ వాయువు గాలిలో ఎంత శాతం ఉందో ఇంతవరకు మానిటరింగ్ చేయలేదు. అధికారుల నిర్లక్ష్యం ప్రజలకు ప్రమాదంగా మారుతుంది.
- Vasu Bathula
- Updated on: Jul 9, 2025
- 9:53 pm
డిజిటల్ యుగం.. మనం సృష్టించుకున్న కొన్ని వస్తువులే మనకు ముప్పుగా..!
దేశంలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాల వల్ల పర్యావరణం, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ-వ్యర్థాలలోని విషపూరిత పదార్థాలు వాతావరణ కాలుష్యానికి, అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. సమర్థవంతమైన రీసైక్లింగ్, వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ అవసరం, ఇది పర్యావరణాన్ని కాపాడటానికి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించటానికి కీలకం.
- Vasu Bathula
- Updated on: May 5, 2025
- 9:20 pm
ఓయూ ఆర్ట్స్ కాలేజ్ భవనానికి ఇండియన్ ట్రేడ్ మార్క్ సర్టిఫికెట్! ఆ రెండు భవనాల తర్వాత..
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల భవనం భారతదేశంలోని ప్రముఖ ట్రేడ్‌మార్క్ భవనాల జాబితాలో చేరింది. ఈ ఘనతను సాధించిన మూడవ కట్టడంగా నిలిచింది. ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ ద్వారా భవనం యొక్క ఆర్కిటెక్చర్ మరియు బ్రాండ్ ఇమేజ్ రక్షించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓయూ పూర్వ విద్యార్థులు ఈ ఘట్టాన్ని ఆనందిస్తున్నారు.
- Vasu Bathula
- Updated on: Apr 30, 2025
- 5:48 pm
Golden Pan: ఈ కిళ్లీ తింటే మీ నోరంతా బంగారం గానూ..! పసిడి పాన్ ధర తెలిస్తే షాక్!
దేశ వ్యాప్తంగా పసిడి పరుగులు తీస్తోంది. తగ్గేదేలే అంటూ రూ. లక్ష వైపు దూసుకెళ్తోంది. పట్టుకోండి చూద్దమంటూ కొండెక్కి కూర్చుకుంది. అయితే పసిడితో పాటు పాన్‌కు కూడా రెక్కలొచ్చాయి. పసిడి పరుగులు తీస్తుంటే.. నేనేమి తక్కువా.. నన్ను చూడంటి అంటూ మెరిసిపోతుంది. ఇంతకు పసిడికి.. పసిడికి పాన్‌కు పోటీ ఏమిటి..?
- Vasu Bathula
- Updated on: Apr 19, 2025
- 6:07 pm