AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tomato Farming: ఈ టమాటా కాస్టిలీ గురూ.. కిలో వెయ్యి.. 15 రకాల టమాటాలను ఇంట్లోనే పండిస్తూ లక్షలార్జిస్తున్న మహిళ

దేశవాళీ టమాటా, బెంగళూరు టమాటాలు ఎక్కువమందికి తెలుసు.. కానీ టమాటాల్లో అనేక రకాలున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో చెర్రీ టమాటాల నుంచి రకరకాల టమాటలున్నాయి.. మంచి డిమాండ్ కూడా ఉంది వీటికి..  ఈ రోజు మనం అలాంటి కొన్ని రకాల టమోటాల గురించి తెలుసుకుందాం.. వీటి ధర తెలిస్తే షాక్ తింటారు కూడా..

Tomato Farming: ఈ టమాటా కాస్టిలీ గురూ.. కిలో వెయ్యి.. 15 రకాల టమాటాలను ఇంట్లోనే పండిస్తూ లక్షలార్జిస్తున్న మహిళ
Foreign Tomato Farming
Surya Kala
|

Updated on: Jun 06, 2023 | 11:19 AM

Share

భారతీయ వంటల్లో మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా టొమాటోలను ఇష్టపడని వారు బహు అరుదని చెప్పవచ్చు. కూరగాయల్లో టొమాటోలది ప్రముఖ స్థానం. ఎర్రగా అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఈ టమాటాలు ముద్దుగా లవ్ యాపిల్స్ అని కొన్ని దేశాల్లో పిలుస్తారు కూడా.. ఆహారానికి అదనపు రుచిని అందించే ఈ టమాటాల్లో విటమిన్లు, పోషక మూలకాలు కూడా అధికంగానే ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ సి ని అందిస్తుంది. రైతు సోదరులు టమోటా సాగును ప్రధాన వృత్తిగా స్వీకరించినవారు అధికంగానే ఉన్నారు. అయితే మనం రెగ్యులర్ గా చూసే టమాటాలు మాత్రమే ఉన్నాయి అనుకుంటే పొరపాటే.. దేశవాళీ టమాటా, బెంగళూరు టమాటాలు ఎక్కువమందికి తెలుసు.. కానీ టమాటాల్లో అనేక రకాలున్నాయి. ముఖ్యంగా విదేశాల్లో చెర్రీ టమాటాల నుంచి రకరకాల టమాటలున్నాయి.. మంచి డిమాండ్ కూడా ఉంది వీటికి..  ఈ రోజు మనం అలాంటి కొన్ని రకాల టమోటాల గురించి తెలుసుకుందాం.. వీటి ధర తెలిస్తే షాక్ తింటారు కూడా..

కిసాన్ తక్ నివేదిక ప్రకారం.. బీహార్‌లో చాలా ఖరీదైన టమోటాలు పండిస్తున్నారు. ఈ టమోటాలు రకరకాల రూపాలతో కనిపిస్తున్నాయి..  వంకాయ, దానిమ్మపండు, చెర్రీల్లా కనిపిస్తూ కనివిందు చేస్తున్నాయి. వీటి ధర సాధారణ టమోటాల కంటే చాలా ఎక్కువ. భాగల్పూర్ జిల్లాలో రైతులు ఖరీదైన టమాటాలు సాగు చేస్తున్నారు. వీటిని మార్కెట్‌లో కిలో రూ.1000కు విక్రయిస్తున్నారు. అయితే ఇంత ఖరీదైన టమోటాలు  సామాన్యులకు అందని కూరగాయే.. అయితే వీటిని ఎక్కువగా ధనవంతులు, స్టార్ హోటల్స్ కొనుగోలు చేస్తున్నాయి. ఈ టమాటా సాగుచేస్తున్న రైతులు భారీ ఆదాయం పొందుతున్నారు.

ఈ టమాటా ధర కిలో రూ.1000

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం భిఖాన్‌పూర్‌కు చెందిన సుజానే బోస్‌ అనే మహిళా రైతు తన ఇంట్లో ఈ టమాట సాగు చేస్తోంది. తన ఇంట్లో కుండీల్లో విదేశీ టమాటాలు పండిస్తోంది. ఆరెంజ్ హట్, బ్లాక్ బ్యూటీ, టెర్రకోట టమాటో, బ్లాక్ స్ట్రాబెర్రీ , పినోచియో టమాటా వంటి 15 రకాల టమాటాలు ఈ సుజానే ఇంట్లో పెరుగుతున్నాయి. మార్కెట్‌లో దేశవాళీ టమోటాలు కిలో రూ.40 పలుకుంటుంటే.. అక్కడ సుజానే పండిస్తున్న టమాటో కిలో రూ.1000లు పలుకుతోంది. ఈ టమోటాలు పిజ్జా, అనేక ఇతర వంటకాల తయారీలో ఉపయోగిస్తున్నారు.

 ద్రాక్షలా కనిపించే టమాటాలు 

విదేశీ టమాటా సాగులో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని మహిళా రైతు సుజానే అంటున్నారు. ఒక్కాసారి కాపు మొదలు పెడితే.. అధికంగా టమాటా దిగుబడినిస్తాయని చెబుతున్నారు. తాను త్వరలో ఈ టమాట విత్తనాలను రైతులకు అందజేస్తానని చెబుతున్నారు  పూణే నివాసి. చాలా కాలంగా విదేశీ టమాట సాగు చేస్తున్నానని చెప్పారు. వీటిని సాగు చేసి తాను బాగా సంపాదిస్తున్నానని.. రష్యా, అమెరికా నుంచి ఈ విదేశీ టమాట విత్తనాలు తెప్పించుకున్నానని మహిళా రైతు సుజానే తెలిపారు. ఈ టమోటా మొక్కలు మూడు నెలల్లో టమాటా దిగుబడిని  ఇస్తాయి. విశేషమేమిటంటే ఒకే మొక్కలో అనేక రకాల టమోటాలు పెరుగుతాయి.  కొన్ని వంకాయలా అనిపిస్తే.. మరికొన్ని దానిమ్మలా కనిపిస్తాయి. కొన్ని రకాల టమోటాలు  ద్రాక్షలా కనిపిస్తాయని చెప్పారు సుజానే.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
నాట్యం చేస్తున్న గ్రహాలు.. ఉగాది నుంచి వారికి ఏడుపు షురూ..
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'
'నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. ఏం చేయాలో తెలియక ఏడ్చేశా'
కలలో బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
కలలో బల్లి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా..?
పసిడి ప్రియులకు చల్లని వార్త.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..
పసిడి ప్రియులకు చల్లని వార్త.. స్థిరంగా బంగారం, వెండి ధరలు..
ఆయిల్ లేకుండానే అప్పడాలు వేయించవచ్చు.. ఈ క్రేజీ ట్రిక్‌తో
ఆయిల్ లేకుండానే అప్పడాలు వేయించవచ్చు.. ఈ క్రేజీ ట్రిక్‌తో
పాడైన కిడ్నీలను నీరు బాగు చేయగలదా? అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు!
పాడైన కిడ్నీలను నీరు బాగు చేయగలదా? అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు!
మెటా నుంచి 16 వేల మంది ఉద్యోగుల తొలగింపు?
మెటా నుంచి 16 వేల మంది ఉద్యోగుల తొలగింపు?
రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ.. ఐదుగురికి పాజిటివ్..
రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ.. ఐదుగురికి పాజిటివ్..
తెలంగాణలో ఎయిర్‌పోర్టుల్లా మారనున్న 5 రైల్వే స్టేషన్లు!
తెలంగాణలో ఎయిర్‌పోర్టుల్లా మారనున్న 5 రైల్వే స్టేషన్లు!
100 రోగాలకు ఒకటే మందు..! ఐరన్, కాల్షియం టాబ్లెట్లు వద్దు
100 రోగాలకు ఒకటే మందు..! ఐరన్, కాల్షియం టాబ్లెట్లు వద్దు