Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dogs eat Grass: కుక్కలు గడ్డి ఎందుకు తింటాయో మీకు తెలుసా.. అసలు కారణం ఇదే..

కుక్కలు గడ్డిని ఎందుకు తింటాయి తెలుసా.. మీరు కూడా చూసి ఉంటారు. కుక్క గడ్డి తినడం మీకు వింతగా అనిపించవచ్చు. కానీ అవి ఎందుకు గడ్డిని తింటాయి అనే విషయం తెలుసుకున్న తర్వాత అది వాటికి ఎంత ముఖ్యమో మీకే అర్థమవుతుంది.

Dogs eat Grass: కుక్కలు గడ్డి ఎందుకు తింటాయో మీకు తెలుసా.. అసలు కారణం ఇదే..
Dogs Eat Grass
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 06, 2023 | 10:36 AM

కొన్నిసార్లు కుక్కలు అకస్మాత్తుగా గడ్డి తినడం మీరు చూసి ఉండాలి. కానీ అవి ఇలా ఎందుకు చేస్తున్నాయో మీకు అర్థం కాకుండి ఉంటుంది. అసలు కుక్కలు గడ్డి తినడం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? మీ ఇంట్లో కుక్క ఉంటే లేదా మీకు కుక్కలంటే ఇష్టమైతే దాని గురించి తెలుసుకోవాలి. నిజానికి, కుక్కలు తరచుగా మాంసం, పాలు, గుడ్లు తింటాయి. దీనితో పాటు, అవి మనం తినే ప్రతిదాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అందుకే కుక్క గడ్డి తినడం, మనం దానిని చూడటం వింతగా భావిస్తారు. కాబట్టి కుక్కలు గడ్డిని ఎందుకు తింటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

కొన్ని సమయాల్లో కుక్కలకు అవి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల కడుపు నొప్పి మొదలవుతుంది. ఇలా కడుపునొప్పిగా ఉన్నప్పుడు కుక్కలు గడ్డి తింటాయని.. అలా గడ్డి తిన్న తర్వాత వాంతులు చేసుకోవడానికి ఇదే కారణం అని మనం అనుకుంటాం. అయితే, ప్రతి కుక్క అలా చేయదు. కొన్ని కుక్కలు గడ్డి తిన్న తర్వాత ఇతర ఆహారాన్ని కూడా తిని హాయిగా జీవిస్తాయి. ది గార్డియన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, కుక్క గ్యాస్ సంబంధిత సమస్యలను కలిగించే వాటిని తిన్నప్పుడు మాత్రమే గడ్డిని తింటుంది. ఆపై దానిని నయం చేయడానికి గడ్డి తింటుంది. మరోవైపు, కొన్ని కుక్కలు తమ శరీరంలో ఫైబర్ లేనప్పుడు గడ్డి తినడానికి ఇష్టపడతాయి.

పెంపుడు కుక్కలు అప్పుడప్పుడు గడ్డి తింటే మంచిదేనా..?

గార్డియన్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, ప్రతిరోజూ 80 శాతం కుక్కలు గడ్డిని తింటాయని కొన్ని పరిశోధనలు చూపించాయి. అయితే ఏ పెంపుడు కుక్క అయినా రోజూ గడ్డి తినడం సరైనదేనా? ఇందులో రెండు కోణాలు ఉన్నాయి.

మీ కుక్క ప్రతిరోజూ కొద్దిగా గడ్డి తింటే దానిలో సమస్య లేదు. అయితే కుక్క గడ్డి తినే సమయంలో ఆ గడ్డిపై పురుగుమందు చల్లలేదని గుర్తుంచుకోవాలి.. పొరపాటున కుక్క అలాంటి గడ్డిని తింటే ఆరోగ్యం పాడవుతుంది.. సకాలంలో వైద్యం అందకపోతే.. దాని ప్రాణం కూడా పోతుంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం