Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tuesday Puja Tips: కుజ దోష, శని దోష నివారణకు మంగళవారం హనుమంతుడిని ఎలా పూజించాలంటే..

. హిందూ మతంలో హనుమంతుడు అత్యంత శక్తివంతమైన దేవుడిగా పరిగణిస్తారు. ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే  మంగళ, శనివారాల్లో భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆంజయనేయ అనుగ్రహంతో ఆ కష్టాలు తీరని విశ్వాసం అందుకే ఆయన్ని హనుమంతుడు సంకట మోచనుడు అని పిలుస్తారు. భక్తుల కష్టాలను తొలగిస్తాడు. ఆయన్ని  పూజించి పూజిస్తే 10 రకాల ఆటంకాలు తొలగిపోతాయి.

Tuesday Puja Tips: కుజ దోష, శని దోష నివారణకు మంగళవారం హనుమంతుడిని ఎలా పూజించాలంటే..
Tuesday Puja Tips
Follow us
Surya Kala

|

Updated on: Jun 06, 2023 | 10:43 AM

పవనపుత్ర హనుమంతుడి వైభవం గురించి.. మహిమ గురించి ఎంత చెప్పినా తక్కువే. రామ భక్తుడైన హనుమంతుడిని పూజించే వ్యక్తి జీవితం ఎప్పుడూ సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఎటువంటి దుఃఖం అయినా హనుమంతుడి అనుగ్రహంతో తీరిపోతుంది. కలియుగంలో హనుమంతుడిని పూజించే వ్యక్తికి రోగాలు, దుఃఖం, పాపం, కష్టాలు వంటివి దరిచేరవని.. వాటి నుంచి విముక్తి పొందుతాడని విశ్వాసం. హిందూ మతంలో హనుమంతుడు అత్యంత శక్తివంతమైన దేవుడిగా పరిగణిస్తారు. ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతుంటే  మంగళ, శనివారాల్లో భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆంజయనేయ అనుగ్రహంతో ఆ కష్టాలు తీరని విశ్వాసం అందుకే ఆయన్ని హనుమంతుడు సంకట మోచనుడు అని పిలుస్తారు. భక్తుల కష్టాలను తొలగిస్తాడు. ఆయన్ని  పూజించి పూజిస్తే 10 రకాల ఆటంకాలు తొలగిపోతాయి.

కుజ దోష నుండి విముక్తి..

ఎవరి జాతకంలో నైనా కుజ దోషం ఉన్నట్లయితే.. వారు ప్రతి మంగళవారం హనుమంతుడికి సింధూరాన్ని  సమర్పించాలి. ఆ రోజు ఉపవాస దీక్ష చేపట్టి.. హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. ఇలా చేయడం వలన మంగళ దోషం తొలగి పోతుందని విశ్వాసం. అంతేకాదు మంగళ వారం పప్పు, స్వీట్లు, రక్తచందనాన్ని ఎర్రటి గుడ్డలో చుట్టి ప్రవహించే నీటిలో విడిచి పెట్టాలి. ఇలా చేయడం వలన మంగళ దోషాల నుండి విముక్తి లభిస్తుందని విశ్వాసం.

శని వక్ర దృష్టి నుంచి విముక్తి.. 

హనుమంతుడి ఆరాధన శనీశ్వరుడు చెడు దృష్టి ప్రభావాన్ని తగ్గించడానికి చాలా ప్రభావవంతమైన పరిహారం. ఏలి నాటి శని తో కష్టాలు పడేవారు.. మంగళవారం గుడికి వెళ్లి హనుమాన్ చాలీసా పఠించాలి. దీనితో పాటు, శనివారం సుందరకాండ పఠనం కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శనివారం నాడు హనుమాన్ దేవాలయంలో పిండి దీపం వెలిగించాలి. దీని ద్వారా శని దోషం నుండి విముక్తి లభిస్తుంది.

దెయ్యాలు, పిశాచాలు దగ్గరకు రాకుండా.. 

హనుమంతుడిని పూజించే వారి దగ్గరికి దయ్యాలు, భూతాలు కూడా రావు. ఎవరైనా ఈ రకమైన సమస్యతో పోరాడుతున్నట్లయితే.. వారు భజరంగ బలిని పూజించాలి. హనుమంతుడికి అంకితం చేసిన మంగళవారాలు, శనీశ్వరుడికి అంకితం చేసిన శనివారాల్లో హనుమాన్ ఆలయానికి వెళ్లి ధూప దీపం, నైవేద్యంతో పూజించండి.  ఇంటిపై హనుమంతుడు ఉన్న  ఎర్ర జెండాను ఎగురవేయడం ద్వారా దుష్టశక్తుల నీడ సమీపంలో కూడా సంచరించదని విశ్వాసం.

అనారోగ్యంతో ఇబ్బంది పడుతుంటే.. 

ప్రతిరోజు బజరంగబలిని స్మరించుకునే వారిని రోగాలను, దుఃఖాల నుంచి విముక్తి చేస్తాడు. మీరు ఏదైనా శారీరక సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. హనుమాన చాలీసా పఠనం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎవరికైనా కీళ్ల నొప్పులు, గొంతు సమస్యలు, కీళ్లనొప్పులు వంటి సమస్యలు ఉంటే.. హనుమంతుడి పటం  ముందు ఒక కుండలో నీటిని ఉంచి 21 రోజుల పాటు హనుమంతుడి చాలీసా పారాయణం చేసి, ఆ నీటిని ప్రతిరోజూ తీసుకోండి. ఇలా చేయడం వల్ల వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది.

భయం తొలగించడానికి.. 

ఎవరినైనా ఎప్పుడూ చీకటి, దెయ్యాల భయం వెంటాడుతూ ఉంటే, రాత్రి పడుకునే ముందు ‘హం హనుమంతే నమః’ అని జపించాలి. చేతులు, కాళ్ళు కడుక్కున్న తర్వాత కనీసం 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇలా చేసేవారి మనసులోంచి భయాలన్నీ దూరమై ప్రశాంతంగా నిద్రపోతారు.

శత్రు భయం నుండి ఉపశమనం..

హనుమంతుడు తన భక్తులపై ఎప్పుడూ అనుగ్రహాన్ని కురిపిస్తూనే ఉంటాడు. తనను ఆరాధించే భక్తులకు శత్రు భయాన్ని లేకుండా చేస్తాడు. సురక్షితంగా ఉండేలా చూస్తాడు. మీ ఉన్నతిని చూసి అసూయ పడే శత్రువుల ను ఓడించాలంటే.. 21 రోజుల పాటు ఒకే చోట బజరంగ బాన్ అష్టకాన్ని పఠిస్తే శత్రులపై మీకు విజయం లభిస్తుంది.

కోర్టు , జైలు శిక్షల నుంచి ఉపశమనం..

హనుమంతుడిని పూజిస్తే ఎవరిని జైలులో బందీగా ఉంచలేరు. ఉదయం, సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించే వ్యక్తిని ఎవరూ బందీగా ఉంచలేరు.  అన్ని బంధాల నుండి విముక్తుడై ఉంటాడు. ఎవరైనా జైలు శిక్ష అనుభవిస్తున్నట్లయితే  వారు హనుమాన్ చాలీసాను 108 సార్లు పఠించాలి, ఈ పరిహారం చేయడం ద్వారా జైలు నుండి విముక్తి పొందుతారు. అంతేకాదు ఏదైనా ఒక కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతున్నట్లు అయితే.. హనుమంతుడిని ఆరాధించడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

ప్రమాద నివారణ..

శనీశ్వరుడు,  రాహు-కేతువుల దుష్ప్రభావాల వల్ల మనిషి ప్రమాదాలకు గురవుతాడు. ఆకస్మిక ప్రమాదాలు,  అగ్ని వంటి సమస్యల భయం ఉంటుంది. బజరంగబలి తన భక్తులను అటువంటి ఇబ్బందుల నుండి కూడా దూరంగా ఉంచుతాడు. అందుకే నిత్యం హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. సుందరకాండ పారాయణం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాదు యాక్సిడెంట్స్ వంటి ప్రమాదాలకు దూరంగా ఉంచుతాడు. పవన తనయుడు.

సంక్షోభ నివారణకు.. 

హనుమంతుడిని సంకట మోచనుడు అని పిలుస్తారు. తన భక్తుల కష్టాలన్నింటినీ తొలగించి సుఖ సంతోషాలను ఇస్తాడు. ఎవరైనా ఏదైనా సంక్షోభంలో ఉంటే.. అతను నియమాల ప్రకారం బజరంగబలిని పూజించాలి. ఇలా చేసేవారి కష్టాలన్నీ తొలగిస్తాడు సంకట మోచనుడు.

పనిలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా.. 

హనుమంతుడిని పూజించే భక్తులకు ఏ పనిలోనూ ఆటంకం కలగదు. అతను ఎల్లప్పుడూ తన భక్తులకు పై అనుగ్రహాన్ని కురిపిస్తాడు. రామ నామస్మరణను అడ్డుకున్న శని దేవుడిని కూడా హనుమంతుడు  తన తోకలో చుట్టి ఖైదీ చేశాడు. క్షమాపణలు చెప్పిన శనీశ్వరుడికి తన వాలం నుంచి విముక్తినిచ్చాడు.  అప్పుడు హనుమంతుడిని పూజించేవారికి తాను బాధించనని .. వారు చేసే పనుల్లో ఆటంకాలు కలగవని చెప్పాడు శనీశ్వరుడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).