Constellation: ఈ రాశి వ్యక్తులు ధైర్య వంతులు, స్వార్ధపరులు .. ఏదో రకంగా కోరికలను నెరవేర్చుకుంటారు!

Ashlesha Nakshatra: ముల్లు ను ముల్లుతో తీయాలి. విషానికి విషం విరుగుడు.. అంటే ఈ వ్యక్తులు ప్రతికూల శక్తిని ఉపయోగించడంలో చాలా ప్రవీణులు. వారు ధైర్యంగా , నిర్భయంగా ఉంటారు. కష్టతరమైన పనులను,  సవాళ్లను స్వీకరించడానికి వెనక్కి తగ్గడు. ఈ వ్యక్తులు తమ శత్రువులను పూర్తిగా నాశనం చేసిన తర్వాత మాత్రమే ఊపిరి పీల్చుకుంటారు లేదా శత్రువులకు హాని చేయడానికి వారు ఎంతటికైనా వెళ్తారని చెప్పవచ్చు.

Constellation:  ఈ రాశి వ్యక్తులు ధైర్య వంతులు, స్వార్ధపరులు .. ఏదో రకంగా కోరికలను నెరవేర్చుకుంటారు!
Ashlesha Nakshatra
Follow us

|

Updated on: Jun 06, 2023 | 8:42 AM

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నక్షత్రాలు 27. ఈ 27 నక్షత్రములలో తొమ్మిదవది. ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష అంటే ఆలింగనం చేసుకోవడం. ఆశ్లేష నక్షత్ర సమూహంలో 6 నక్షత్రాలు వృత్తాకారంలో ఉంటాయి. కొంతమంది వాటిని సర్పంగా కూడా భావిస్తారు. ఆశ్లేష నక్షత్ర గణము రాక్షస గణం. అధిదేవత పాము. పామును దేవతలుగా భావించి పూజిస్తారు. విష్ణువుకు శయ్యగా.. శివయ్యకు ఆభరణంగా ఉన్నవి కూడా పాములే.

ఆశ్లేష నక్షత్రం వంశపారంపర్య లక్షణాలను.. ప్రత్యేక సామర్థ్యాలను కలిగి ఉంటుంది. గత జన్మలో సగం పూర్తయిన పనులను ఈ జన్మలో పూర్తి చేయాలనే కోరికను కలిగి ఉంటుంది. సర్ప రాజు శేషుడు ఈ రాశికి అధిదేవతగా పరిగణించబడుతున్నాడు. శ్రీరాముని తమ్ముడు లక్ష్మణుడు.. శ్రీకృష్ణుని అన్నయ్య బలరాములు ఆది శేషుడు అవతారాలు మాత్రమే. సైన్స్  ప్రకారం.. అలలు కూడా పాము రూపంలో ఎగురుతూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం రాశి కర్కాటక రాశి.

ప్రత్యేకత

ఇవి కూడా చదవండి

ముల్లు ను ముల్లుతో తీయాలి. విషానికి విషం విరుగుడు.. అంటే ఈ వ్యక్తులు ప్రతికూల శక్తిని ఉపయోగించడంలో చాలా ప్రవీణులు. వారు ధైర్యంగా , నిర్భయంగా ఉంటారు. కష్టతరమైన పనులను,  సవాళ్లను స్వీకరించడానికి వెనక్కి తగ్గడు. ఈ వ్యక్తులు తమ శత్రువులను పూర్తిగా నాశనం చేసిన తర్వాత మాత్రమే ఊపిరి పీల్చుకుంటారు లేదా శత్రువులకు హాని చేయడానికి వారు ఎంతటికైనా వెళ్తారని చెప్పవచ్చు. కనుక ఈ నక్షత్రంలో జన్మించిన వారు పోలీసు, సైన్యం లేదా మందుగుండు సామగ్రిని ఉపయోగించే వృత్తిని ఎంచుకోవడం మంచిది. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులను ఎవరూ సులభంగా ప్రభావితం చేయలేరు. వీరు స్వార్ధ పరులు. తమగురించి మాత్రమే ఎక్కువగా ఆలోచించుకుంటారని ఆచరణాత్మకమైన జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు.

ఈ వ్యక్తులు నీతి సూత్రాలను పాటించాలని భావించరు. తమ సౌలభ్యం కోసం దేశం, సమయం లేదా పరిస్థితిని చూసి తమ మార్గాన్ని మార్చుకుంటూ ఉంటారు. ఈ రాశిలోని వ్యక్తులు ఇతరులను కీర్తించడంలో నిష్ణాతులు. పరిశోధన, లొసుగులను కనుగొనడం, ప్రత్యర్థులను ఓడించడానికి వ్యూహం రూపొందించడం, శోధన ఆపరేషన్ మొదలైన వాటికి సంబంధించిన వృత్తులలో ఈ వ్యక్తులు చాలా బాగా  రాణిస్తారు. ముఖ్యంగా ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).