Viral Video: దాహం ఎవరికైనా ఒకటే.. వ్యక్తి ఇస్తున్న నీరుని చకచకా తాగేస్తున్న పాము.. అన్నా..! నీ ధైర్యానికి సలామ్ అంటున్న నెటిజన్లు..
భూమి మీద నివసించే జంతువుల్లో ఒకటి పాము. విషపూరితమైనవి అయినా, విషపూరితం కాకపోయినవి అయినా పాముకి చూస్తే చాలు.. వెంటనే అక్కడ నుంచి పరుగు పెడతారు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న పాముని చూసి సాయం చేయమని వేడుకుంటుంటే సాయం చేయడానికి ఎవరూ దైర్యం చెయ్యరు.

ఆకలి, దాహం జీవికైనా ఒకటే.. పరిస్థితులతో సంబంధం లేకుండా ఆకలి, దప్పికలు మనుషులను, జంతువులను కూడా వెంటాడతాయి. ఇక వేసవి కాలం వచ్చిందంటే చాలు దాహంతో అల్లాడుతూ ఉంటాం. తీవ్ర అశాంతికి గురవుతాము. ఆకలి దప్పికలు గురించి మాటలు వచ్చిన మనిషి సాటి వాడికి తెలియజేస్తారు. అయితే నోరు లేని జీవులు తమ బాధను తెలియజేయలేక అల్లాడతాయి. వేటాడే జంతువులు సైతం.. తన నైజంను మరిచి మరీ.. తన దాహార్తి తీర్చేవారి కోసం ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాయి. ఇటీవల సోషల్ మీడియాలో కూడా ఇలాంటి దృశ్యమే వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా మానవత్వం ఇంకా బతికే ఉందని అంటారు.
భూమి మీద నివసించే జంతువుల్లో ఒకటి పాము. విషపూరితమైనవి అయినా, విషపూరితం కాకపోయినవి అయినా పాముకి చూస్తే చాలు.. వెంటనే అక్కడ నుంచి పరుగు పెడతారు. ఈ నేపథ్యంలో ఆపదలో ఉన్న పాముని చూసి సాయం చేయమని వేడుకుంటుంటే సాయం చేయడానికి ఎవరూ దైర్యం చెయ్యరు. ఎందుకంటే తమ జీవితం తమకు ముఖ్యం అని భావిస్తారు కనుక. అయినప్పటికీ ఈ కలియుగంలో కూడా మానవత్వం ఉన్న కొంతమంది వ్యక్తులు ఉన్నారు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆపన్నులను ఆడుకుంటారు. వైరల్ అవుతున్న వీడియో పాముకి సంబంధించినది. పాముకి నీరు ఇస్తూ దాహాన్ని తీర్చడం కనిపిస్తుంది.




వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి పాముకు నీరు తాగిస్తున్నట్లు కనిపిస్తుంది. అందునా ఆ పాము అతి పెద్ద విషపు పాము అనిపిస్తుంది. ఆ పాముని వీడియోలో చూస్తుంటేనే భయం కలిగేలా ఉంది. అలాంటి పాముకి దైర్యంగా నీరుని తాగించడం చూస్తే.. ఆ వ్యక్తి ధైర్యానికి సలాం అనాల్సిందే ఎవరైనా.. ప్రస్తుతం ఈ క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. చాలా ఆశ్చర్యపరుస్తుంది.
View this post on Instagram
ఈ క్లిప్‌ను aryan_466_466 అనే ఖాతా ద్వారా Instagramలో షేర్ చేసారు. ఇప్పటికే మూడు లక్షల మందికి పైగా ఈ క్లిప్‌ను లైక్ చేసారు. భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ వ్యక్తి చాలా గొప్ప పని చేసాడు.. మనమందరం అతని నుండి నేర్చుకోవాలి’ అని కొందరు వ్యాఖ్యానిస్తే.. మరోవైపు, ‘దీన్నే మానవత్వం అంటారు..’ అని మరోకరు రాశారు.. అయితే ఇలా చేయడం ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడమే అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..