Cultured Ghee vs Ghee: నెయ్యి- కల్చర్డ్ నెయ్యి ఈరెండింటి మధ్య తేడా ఎంటో తెలుసా.. ఎలా తయారు చేస్తారంటే..

చాలా మంది మనల్ని “ నెయ్యి మరియు కల్చర్డ్ నెయ్యి మధ్య తేడా ఏంటి ” అని అడుగుతారు. సమాధానం నిజానికి చాలా సులభం. పాల నుంచి నెయ్యి తయారవుతుంది. కల్చర్డ్ నెయ్యి పెరుగు నుంచి తయారవుతుంది. అయితే ఇది ఎలాని మనలో చాలా మందికి డౌట్ వస్తుంది. నిజంగా ఈ రెండి మధ్య ఇంత తేడా ఉంటుందా అని మీకు డౌట్ రావొచ్చు.. అవును ఈ రెండు వేరు వేరు పద్ధతుల్లో తయారు చేస్తారు.. అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం..

Cultured Ghee vs Ghee: నెయ్యి- కల్చర్డ్ నెయ్యి ఈరెండింటి మధ్య తేడా ఎంటో తెలుసా.. ఎలా తయారు చేస్తారంటే..
Cultured Ghee Vs Ghee
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 06, 2023 | 11:55 AM

నెయ్యి.. మానిషి సంచారజీవనం వదలి, స్దిరనివాసం ఏర్పరచుకొని వ్యవసాయం చేయ్యడం మొదలుపెట్టె కంటే ముందు పశువులను మచ్చిక చేసుకొని పాల వుత్పత్తి.. ఇతర వ్యవసాయ పనులకు వినియోగించుకోవటం ప్రారంభించాడు. ఆ తర్వాత ఆవు నుంచి పాలు.. పాల నుంచి వెన్న, మీగడ, ఆ తర్వాత నెయ్యి తయారుచేయటం మొదలు పెట్టాడు. ఇలా మన ఆసియా దేశాల్లో విరివిగా నెయ్యిని ఉత్పత్తి చేయడం.. అలా తయారు చేయగా వచ్చిన నెయ్యిని వివిధ రకాలుగా వినియోగిస్తున్నాడు.

విదేశాలలో వెన్ననే ఎక్కువగా ఆహారంగా ఉపయోగిస్తారు. విదేశాలలో నెయ్యిని క్లారిఫైడ్‌ బట్టరు అంటారు. వారు బట్టర్ వరకు మాత్రమే తయారు చేయగలిగారు.. ఆ తర్వాత ఆ బట్టర్‌ను నెయ్యిగా మార్చలేకపోయాడు. తూర్పు దక్షిణ ఆసియా దేశాలు అంటే.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఛైనా, నేపాల్‌లో వెన్ననుంచి నెయ్యిని తయారుచేసి ఉపయోగించారు.

భారతదేశంలో వేదకాలం నాటికే నెయ్యిని వాడినట్లుగా చరిత్ర ఉంది. యజ్ఞాలలో హోమగుండంలో అగ్నిని ప్రజ్వలింప చేయుటకు నెయ్యిని వాడెదరు. ఆయుర్వేదంలో నెయ్యిని ప్రశస్తమైన స్వాత్తిక ఆహారంగా చెప్పబడింది. నెయ్యిని ఆవు, గేదె పాల వెన్ననుంచి తయారు చేస్తారు. భారతదేశంలో ఆవు, గేదె పాల వెన్ననుంచి నెయ్యిని చేస్తారు. గేదె నెయ్యి కన్న ఆవు నెయ్యిని శ్రేష్టమైనదిగా ఆయుర్వేదంలో చెప్పండింది. నెయ్యి జ్ఞాపకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నెయ్యి మెదడు, నాడీ వ్యవస్థను చురుకుగా ఉండేందుకు పని చేస్తుందని ఆయుర్వీదంలో చెప్పబడింది.

మన భారత దేశంలో నెయ్యిని రెండు రకాలుగా తయారు చేస్తారు. ఒకటి- ఆనాదిగా భారతదేశంలో ఉన్న సంప్రదాయ పద్థతి. రెండు- పారిశ్రామిక పద్థతి. పారిశ్రామిక పద్థతిలో తయారు చేసినదానికంటే సంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన నెయ్య రుచి ఎక్కువగా ఉంటుంది.

సంప్రదాయపద్థతి..

భారతదేశంలో పశుపోషణ ఎక్కువగా గ్రామాలలోనే ఎక్కువ. రైతు కుటుంబాలు వ్యవసాయంతో పాటు పశుపోషన కూడా చేస్తారు. నగారాలలో ఎక్కువగా పాలడైరిల అధ్వర్యంలో పాల వుత్పత్తి జరుగుతుంది. గ్రామాలలో పాలను మరుగపెట్టి పెరుగుగా చేసి, పెరుగును చిలికి పెరుగు నుంచి వెన్న, మజ్జిగ తయారుచేస్తారు. పెరుగును నుంచి వేరుచేసిన వెన్న తగినంత ప్రమాణంలో సేకరించిన తరువాత వెన్నను కరగించి నెయ్యిని చేస్తారు. సేకరించిన వెన్నను ఒక పెద్ద వెడల్పాటి పాత్రలో తీసుకొని సన్నని మంట క్రింద నెమ్మదిగా వేడిచేస్తారు. అంటే కేవలం 110 నుంచి 1200C ఉష్ణోగ్రతపై వేడి చేస్తారు.

మొదటలో వేడిచేయునప్పుడు చిటపట ధ్వనులతో, పొంగుతో వెన్నమరగటం మనం చూడవచ్చు. వెన్నలో అధిక శాతంలో నీరు ఉండటం వలన ఈ విధంగా చిటపట ఎందుకు వస్తుందని మనలో వచ్చే ప్రశ్న. వెన్ననెమ్మదిగా కరగటం ప్రారంభించును. మరుగునప్పుడు వచ్చే పొంగును తగ్గించేందుకు అందులో ఓ తమలపాకును వేస్తారు. తమలపాకులను వేయడం వలన మరుగుతున్న వెన్నలో సువాసన భరితంగా మారును. వెన్నకరిగి, తేమ తగ్గిపోయిన తరువాత నెయ్యి లేతపసుపు రంగులో పారదర్శకంగా మారుతుంది. ఇలా ఏర్పడిన నెయ్యిని కొద్దిగా చల్లార్చి వడపోసి నెయ్యిలోని మలినాలను తొలగించెదరు. నెయ్యులో సంతృప్త కొవ్వుఆమ్లాలు 68 శాతం వరకు ఉండటం వలన గది ఉష్ణోగ్రత వద్ద నెయ్యి గడ్డకట్టును.

పారిశ్రామిక పద్థతి

పాల డైరీలవారు వారు ఉత్పత్తి చేసిన.. రైతుల నుండి సేకరించిన పాలను.. శీతలీకరించి అమ్ముటకు ముందే పాలనుండి మిషన్ల ద్వారా వెన్నను వేరు చేసి, సేకరిస్తారు. ఆలా సేకరించిన వెన్న ఎక్కువ ప్రమాణంలో ఉండటం వలన రియాక్టరులలో వెన్నను కరగించి నెయ్యిని తయారు చేస్రుతారు.

ఈ రెండింటిలో ఏది బెస్ట్..

మనం ఇప్పుడ తెలుసుకున్నట్లుగా.. మీకు డైరీ నెయ్యి అంటే పారిశ్రమిక పద్దతిలో చేసిన నెయ్యి కొత్త రుచికరంగా ఉండదు. మేము కల్చర్డ్ నెయ్యిని సిఫార్సు చేస్తున్నాము . లేకపోతే, ఒరిజినల్ నెయ్యి ఒక అద్భుతమైన ఎంపిక (ఇది కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నది). మీరు రెండింటి చిన్న నమూనాను కూడా ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ఆ తర్వాత మీ కోసం నిర్ణయించుకోవచ్చు.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం