Vastu Tips: ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా.?
ప్రతీ ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవింగ్స్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. వారి ఆదాయానికి అనుగుణంగా సేవింగ్స్‌ను ప్లాన్ చేసుకుంటారు. ఖర్చులకు పోను మిగితాది భవిష్యత్తుకోసం దాచుకుంటారు. అయితే కొందరికి ఎంత సంపాదించినా చేతిలో డబ్బు అస్సలు నిలవదు...

ప్రతీ ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సేవింగ్స్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంటారు. వారి ఆదాయానికి అనుగుణంగా సేవింగ్స్‌ను ప్లాన్ చేసుకుంటారు. ఖర్చులకు పోను మిగితాది భవిష్యత్తుకోసం దాచుకుంటారు. అయితే కొందరికి ఎంత సంపాదించినా చేతిలో డబ్బు అస్సలు నిలవదు. కాస్త డబ్బు జమ అవ్వగానే ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతుంది. అయితే ఇలా జరగడానికి వాస్తు లోపం కూడా ఒక కారణమని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంతకీ డబ్బు నిలవకపోవడానికి ప్రధాన వాస్తు లోపాలు ఏంటి.? దానికి చిట్కాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందా…
* ఇంట్లో డబ్బులు దాచుకునే ప్రదేశం ఉత్తర దిశలోనే ఉండేలా చేసుకోవాలి. ఇంట్లో ఉత్తర భాగం కుబేరునిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ దిశలో డబ్బును దాచుకుంటే ఖర్చులు తగ్గుతాయని చెబుతున్నారు. అలాగే వ్యాపార వృద్ధి యంత్రం, మహాలక్ష్మి యంత్రం వాటిని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ధనప్రాప్తి లభిస్తుంది.
* ఇంట్లో డబ్బు నిలవకపోతే, పూజ గదిలో సంపదకు దేవత అయిన లక్ష్మి, కుబేరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతీరోజూ పూజించాలని చెబుతున్నారు. అనునిత్యం పూజించడం వల్ల ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు అని నిపుణులు చెబుతున్నారు.
* ఇక రాత్రి పూట భోజనం చేసిన తర్వాత చాలా మంది పాత్రలను అలాగే వదిలేస్తారు. అయితే ఇలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేవగానే ఎంగిలి పాత్రలను చూడకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వీలైనంత వరకు రాత్రి పడుకునే ముందే పాత్రలను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు.
* అపరిశుభ్రంగా ఉన్న ఇంట్టో లక్ష్మీ దేవత ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా ఇంటికి ఈశాన్య దిశలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చెత్త ఉండకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈ దిశను ఆలయ స్థలంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మి తల్లికి కోపం వచ్చి ఇంట్లో దరిద్రం వస్తుందని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయత లేదని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




