Kitchen Hacks: బియ్యానికి పురుగులు పడుతున్నాయా.. ఇలా చేస్తే ఏడాది పొడువునా..
నిల్వ చేసిన బియ్యంలో పురుగులు పడుతుంటాయి. ఇలా పురుగులు పట్టిన బియ్యం తినడం వల్ల అనేక జీర్ణ సంబంధిత రోగాలు వస్తాయి. అందుకే మనం బియ్యంలో పురుగులు పట్టకుండా నిల్వ చేసుకునేందుకు కొన్ని చిట్కాలను ఉన్నాయి..
మన నిత్యావసర వస్తువులలో బియ్యం కూడా ఒకటి. అన్నం లేకపోతే మనకు రోజు గడవదు. మనమందరం కష్టపడేది ఈ అన్నం కోసమే. బియ్యాన్ని రెండు, మూడు నెలకు సరిపడేలా లేదా ఆరు నెలలకు సరిపడా కొనుగోలుచేసి నిల్వ చేసుకుంటుంటారు మనలోని చాలా మంది. ఇలా బియ్యం నిల్వ ఉంచుకోవడం మంచిదే. కానీ నిల్వ చేసుకుంటున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి. ఎందుకంటే నిల్వ చేసిన బియ్యంలో పురుగులు పడుతుంటాయి. ఈ పురుగులు విసర్జంచే వ్యర్థాలు, మలినాలు బియ్యంలో అలానే ఉండిపోతాయి. ఇలా పురుగులు పట్టిన బియ్యం తినడం వల్ల అనేక జీర్ణ సంబంధిత రోగాలు వస్తాయి. అందుకే మనం బియ్యంలో పురుగులు పట్టకుండా నిల్వ చేసుకోవడం చాలా అవసరం.
అందులోనూ వర్షాకాలంలో తేమ చాలా పెరుగుతుంది. దీని కారణంగా కీటకాలు కూడా మూసివున్న వస్తువులలోకి చేరిపోతాయి. ఇలాంటప్పుడు మన ఇంట్లో నిల్వ చేసినవి చెడిపోతుంటాయి. మూసి ఉంచిన బియ్యంలో కూడా పురుగులు మొదలవుతాయి. అటువంటి పరిస్థితిలో, బియ్యం శుభ్రం చేయడం చాలా కష్టం అవుతుంది. అన్నం వండేటప్పుడు పురుగుల భయం అలాగే ఉంటుంది. ఇక్కడ కొన్ని సులభమైన చిట్కాలను అనుసరిస్తే బియ్యంలోకి పురుగులు చేరకుండా చూసుకోవచ్చు.
అయితే మనకు మార్కెట్‌లో పురుగు పట్టకుండా కెమికల్ పౌడర్లు దొరుకుతుంటాయి. ఈ కెమికల్ పౌడర్లను బియ్యంలో కలపడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా చేసుకోవచ్చు. ఇలాంటి కెమికల్ పౌండర్ల కలిపిన బియ్యం తినడం వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ కెమికల్స్ ఉపయోగించకుండా హోం రెమిడీ చిట్కాలను ఉపయోగించవచ్చు. ఈ చిట్కాలతో బియ్యం పురుగు పట్టకుండా చేయవచ్చు. ఈ చిట్కాలను ఓ సారి పరిశీలిద్దాం..
కీటకాల నుండి బియ్యం రక్షించడానికి సాధారణ మార్గాలు
1) బే ఆకు (బిర్యాణీ ఆకులు)
నిల్వ చేసిన బియ్యంకు పురుగులు పట్టకుండా ఇది ఉత్తమ మార్గాలలో ఒకటి. బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో బే ఆకులను ఉంచండి. బియ్యాన్ని గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి.
2) లవంగాలు
బియ్యం నిల్వ చేసిన డబ్బాల్లో కొన్ని లవంగాలను వేయండి. దీంతో ఆ బియ్యంలోకి పురుగులు చేరవు. లవంగాలకు కీటకాలతో పోరాడే గుణం ఉంటుంది. బియ్యం పురుగుపట్టకుండా చేయడంలో లవంగాలు సమర్థవంతంగా పని చేస్తాయి. బియ్యంలో లవంగాలను ఉంచడం వల్ల లేదా లవంగాల పొడిని వస్త్రంలో కట్టి బియ్యంలో ఉంచడం వల్ల కూడా పురుగు పట్టకుండా ఉంటుంది.
3) వెల్లుల్లి
వెల్లుల్లి పొట్టును మనం బయట పడేస్తుంటాం. అలా చేయకుండా వెల్లుల్లి పొట్టు తీసి బియ్యంలో ఉంచడం వల్ల బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.
4) కర్నూరం
కర్ఫూరాన్ని కూడా పరుగులు రాకుండా ఉపయోగించవచ్చు. కొంత కర్పుం తీసుకుని చిన్న గుడ్డలో మూటలుగా కట్టి బియ్యంలో ఉంచడం వల్ల పురుగులు పట్టకుండా నిల్వ చేసుకోవచ్చు.
5) వేపాకు
బియ్యంలో పురుగులు చేరకుండా అద్భుంగా పని చేస్తుంది వేపాకు. బియ్యాన్ని నిల్వ చేసుకునే డబ్బా అడుగు భాగాన వేపాకును ఉంచాలి. ఈ వేపాకుపై బియ్యం పోయాలి. ఇలా కాకుండా వేపాకుల పొడిని ఓ గుడ్డలో మూటలుగా కట్టి బియ్యంలో ఉంచితే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూడా బియ్యం పురుగు పట్టకుండా ఉంటుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ వార్తల కోసం