Kitchen Tips: మీ వంటింట్లో వస్తువులు నకిలీవా.? అసలైనవా.? ఇలా తెలుసుకోండి..

మరీ ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకునే ఆహార పదర్థాలు సైతం నకిలీగా మారుతోన్న తరుణం ఇంది. కంది పప్పు నుంచి చెక్కర వరకు ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలను కల్తీగా మార్చేస్తూ కేటుగాళ్లు డబ్బులు నొక్కేస్తున్నారు. దీంతో జేబుకు చిల్లు పడడంతో పాటు ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతుంది. అయితే మనం కొనుగోలు చేసిన ఆహార పదార్థాలు మంచివేనా.? కల్తీవా.? తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు...

Kitchen Tips: మీ వంటింట్లో వస్తువులు నకిలీవా.? అసలైనవా.? ఇలా తెలుసుకోండి..
Kitchen Tips
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 19, 2023 | 3:47 PM

మోసం జరగని చోటును భూతద్ధంలో వెతికినా కనిపించని పరిస్థితి ఉంది. కొంత మంది స్వార్థపరుల కారణంగా ప్రతీ వస్తువు నకిలీ అవుతోంది. నకిలీ వస్తువులను తయారు చేస్తూ అడ్డదారిలో డబ్బులు సంపాదించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. దీంతో అన్ని పదార్థాలు కల్తీగా మారుతున్నాయి.

మరీ ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకునే ఆహార పదర్థాలు సైతం నకిలీగా మారుతోన్న తరుణం ఇంది. కంది పప్పు నుంచి చెక్కర వరకు ఇలా అన్ని రకాల ఆహార పదార్థాలను కల్తీగా మార్చేస్తూ కేటుగాళ్లు డబ్బులు నొక్కేస్తున్నారు. దీంతో జేబుకు చిల్లు పడడంతో పాటు ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతుంది. అయితే మనం కొనుగోలు చేసిన ఆహార పదార్థాలు మంచివేనా.? కల్తీవా.? తెలుసుకోవడానికి కొన్ని చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే…

* మనం ఉపయోగిస్తున్న బెల్లం నకిలీదో అసలైందో తెలుసుకునేందుకు ఒక అవకాశం ఉంది. ఇందుకోసం ముందుగా బెల్లాన్ని నీటిలో కరగించాలి. అనంతరం ఆ నీటిలో గాఢ హైడ్రో క్లోరిక్‌ ఆమ్లం కలపాలి. ఒకవేళ ఆ ద్రావణం ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ బెల్లని తెలుసుకోవాలి.

* ఇక కంది పప్పు నాణ్యణతను కూడా హైడ్రోక్లోరిక్‌ ఆమ్లంతో తెలుసుకోవచ్చు. కంది పప్పులో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లాన్ని కలిపితే అది ఎరుపు రంగులోకి మారితే.. దానిని కల్తీ పప్పుగా భావించాలి.

* ఇక వెన్న, నెయ్యి నాణ్యతను తెలుసుకోవడానికి.. వాటిలో హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం, చక్కెరను కలపాలి. ఒకవేళ 5 నిమిషాల తర్వాత నెయ్యి, వెన్న ఎరుపు రంగులోకి మారితే అవి కల్తీవని అర్థం.

* డాల్డాలో గంజిపొడి, ఉడికించిన బంగాళ దుంపను వంటివి యాడ్ చేస్తూ కల్తీ చేస్తుంటారు. అయితే దీని నాణ్యత తెలుసుకోవడానికి డాల్డాకు కొద్దిగా అయోడిన్ కలిపితే నీలిరంగులోకి మారితో సదరు డాల్డా కల్తీది అని అర్థం.

* సుద్ద ముక్కల పొడి, బొంబాయి రవ్వలను కలిపి చక్కెరను కల్తీ చేస్తుంటారు. ఒకవేళ మీరు కొనుగోలు చేసిన చక్కెర కల్తీదో కాదో తెలుసుకోవాలంటే పంచదారను నీటిలో వెయ్యాలి. ఒకవేళ చక్కెర కరిగిన తర్వాత అడుగున రవ్వ కనిపించినా, నీరు తెల్లగా మారినా అది కల్తీ చక్కెరగా భావించాలి.

* శెనగ పిండిలో సాధారణంగా బియ్యపు పిండిని కలుపుతుంటారు. కాబట్టి దీని నాణ్యత తెలుసుకోవాలంటే.. పిండిలో నీటిని కలపాలి. ఒకవేళ నీటి రంగు ఎరుపు రంగులోకి మారితే అది కల్తీ అని అర్థం.

* జీలకర్ర మంచిదా, నకిలీదా తెలుసుకోవాలంటే.. కొంత జీలకర్రను రెండు చేతుల మధ్య తీసుకొని నలపండి. ఒకవేళ చేతులకు రంగు అంటితే అది నకిలీదని అర్థం.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి..

ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
ప్రశాంత్ కిశోర్ వ్యానిటీ వ్యాన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
బీజీటీ ఆస్ట్రేలియాదే.. సిడ్నీలో భారత్ ఘోర పరాజయం
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
వారందరికీ నో రైతు భరోసా..? నగదు సాయం కోసం దరఖాస్తు చేసుకోవాలా..?
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
అత్యంత స్పెషల్ వికెట్ ఇదే.. క్రికెట్ చరిత్రలో తొలిసారి ఇలా
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
రైల్వేలో 32,000 ఉద్యోగాలు.. విద్యార్హతలపై రైల్వే శాఖ కీలక ప్రకటన
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు డేంజర్ బెల్స్‌..!
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
మహిళా అభ్యర్థులకు దేహదారుఢ్య పరీక్షలు షురూ.. చివరి తేదీ ఇదే
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
ఆసీస్ ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన కింగ్ కోహ్లీ
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు!
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..
టీమిండియా విజయానికి 7 వికెట్లు.. ఆసీస్‌కు 91 పరుగులు..