AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jealousy: అసూయతో రగిలిపోతున్నారా.? మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే..

మనిషిలో ఒక్కసారి అసూయ అనే భావం మొదలైతే అది అంత సులభంగా పోదు. ఇతరులపై నిత్యం అసూయతో ఉంటే.. మీరు మీ స్వంత బలాలు, మీలోని క్రియేటివిటీని విస్మరిస్తారు. దీంతో పక్కనవారిపై చూపించే ప్రాధాన్యతను మీపై మీరు చూసుకోలేరు. దీంతో మీ ఎదుగుదల కుంటు పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే అసూయ అనే భావనను వీలైనంత వరకు దూరం చేసుకోవాలని సూచిస్తున్నారు...

Jealousy: అసూయతో రగిలిపోతున్నారా.? మీ మానసిక ఆరోగ్యాన్ని మీరే..
Jealousy
Narender Vaitla
|

Updated on: Nov 19, 2023 | 4:50 PM

Share

కోపం, బాధ, సంతోషం ఇవన్నీ మనిషిలో సహజంగా కనిపించే భావోద్వేగాలు. అయితే ఇలాంటి ఎమోషన్స్‌లో అసూయ కూడా ఒకటి. ఇతర ఎమోషనస్‌ పక్కన వారిపై ప్రభావం చూపిస్తే అసూయ మాత్రం మిమ్మల్ని లోపల దహించివేస్తుంటుంది. అంతేనా మానవ సంబంధాలపై కూడా అసూయ తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక మనిషిలో ఉండే అసూయ మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

మనిషిలో ఒక్కసారి అసూయ అనే భావం మొదలైతే అది అంత సులభంగా పోదు. ఇతరులపై నిత్యం అసూయతో ఉంటే.. మీరు మీ స్వంత బలాలు, మీలోని క్రియేటివిటీని విస్మరిస్తారు. దీంతో పక్కనవారిపై చూపించే ప్రాధాన్యతను మీపై మీరు చూసుకోలేరు. దీంతో మీ ఎదుగుదల కుంటు పడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందుకే అసూయ అనే భావనను వీలైనంత వరకు దూరం చేసుకోవాలని సూచిస్తున్నారు. మీలో పెరిగే అసూయను కంట్రోల్‌ చేసుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు..

* అసలు మీలో అసూయ భావన ఎందుకు కలుగుతుందన్న మూలాన్ని గుర్తించాలి. ఇందుకు మీలో ఆత్మ విశ్వాసం లేకపోవడం కారణమా.? మరే ఇతర కారణం ఉందా తెలుసుకోండి. అసూయ మూలాన్ని కనుగొన్న తర్వాత, దాన్ని అధిగమించడనాకి మీరు ఏం చేయగలరన్న విషయాన్ని తెలసుకోవాలి.

* ఇక మీకు అసూయ అనే భావన కలగడానికి ట్రిగ్గర్స్‌ ఏంటన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ట్రిగ్గర్‌లను గుర్తించడం వల్ల అసూయ భావాన్ని కంట్రోల్‌ చేసుకోవచ్చు. అసూయ ఎప్పుడు, ఎందుకు ఉత్పన్నమవుతుందన్న విషయాన్ని గుర్తించి, అలాంటి సంఘటనకు దూరంగా ఉండేలా చూసుకోవాలి.

* మీలో అసూయ కలుగుతున్న విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో చర్చించండి. కుటుంబసభ్యులు, జీవిత భాగస్వామిల కారణంగా ఏర్పడే అసూయ భావనలకు దీంతో చెక్‌ పెట్టొచ్చు. మీ భాగస్వామితో మీ భావోద్వాగలను పంచుకోవడం ద్వారా కంట్రోల్‌ చేసుకోవచ్చు.

* ఇక మీలో అసూయ భావన తొలగిపోవాలంటే జీవితం గురించి అర్థం చేసుకోవాలి. అనంత కాల గమనంలో రెప్పపాటు జీవితంలో అసూయకు దూరంగా ఉండాలనే భావనను మీలో మీరు నాటుకోవాలి. జీవితం చాలా చిన్నదనే విషయాన్ని అర్థం చేసుకుంటే అసూయకు అసలు చోటే ఉండదు.

* నిజానికి చెప్పాలంటే అసూయ అనే నెగిటివ్‌ ఎమోషన్‌ను కూడా పాజిటివ్‌గా మార్చుకోవచ్చు. ఇతరులపై ఉన్న అసూయను పాజిటివ్‌గా మార్చుకొని జీవితంలో వారికంటే ఉన్నత స్థానానికి ఎలా ఎదగాలన్న కసితో ముందుకు వెళ్లొచ్చు. అలాగే మీ కంటే ధనవంతులను చూసుకొని అసూయ పడే బదులు, మీకంటే పేద వారిని చూసుకొని ‘మనం నయమే కదా’ అనే పాజిటివ్‌ భావనతో ఉండాలి.

* అందం, చదువు, ఉద్యోగం, ఆదాయం ఇలా ప్రతీ అంశంలో అసమానతలు ఉండడం సర్వ సాధారణమైన విషయమని గుర్తుంచుకోవాలి. ఇలాంటి అంశాలపై ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. దీంతో మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

మరిన్ని ఆసక్తికర కథనాల కోసం క్లిక్ చేయండి..