Dream: స్త్రీ, పురుషులకు వేర్వేరు కలలు వస్తాయా.? డ్రీమ్స్ చుట్టూ ఎన్నో ఆసక్తికర విషయాలు
ప్రతీ ఒక్కరికీ కలలు రావడం సర్వసాధారణమైన విషయం. అయితే కలల్లో ఎన్నో అర్థాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. స్త్రీ, పురుషుల్లో కలలు వేర్వేరుగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఇంతకీ కలలు ఎందుకు వస్తాయి.? వీటికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
కలలు సర్వ సాధారణం మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే కలల వెనకాల కూడా ఎంతో సైన్స్ దాగి ఉందని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా మనిషి మానసిక స్థితిని కలలు ప్రభావితం చేస్తాయని నిపుణులు అంటున్నారు. స్వప్నశాస్త్రంతో పాటు డ్రీమ్ సైన్స్‌లోనూ కలలకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను తెలిపారు. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
* స్త్రీ, పురుషులకు కలలు ఒకేలా ఉండవని నిపుణులు చెబుతున్నారు. స్త్రీల కలల్లో స్త్రీపురుషులు సమానంగా ఉంటే, పురుషుల కలల్లో 70శాతం పురుషులే కనిపిస్తారనే అధ్యయనాలు చెబుతున్నాయి.
* ఇక కలల్లో చాలా వరకు తెలిసిన వ్యక్తులే కనిపిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. దీనికి కారణం మెదడుకు కేవలం మనం చూసిన వాటినే ఆవిష్కరిస్తుంది. మన కళ్లు చూడని కొత్త ముఖాలను ఆవిష్కరించుకునే శక్తి మెదడుకి లేదని పరిశోధకులు చెబుతుంటారు.
* పుట్టుకతో అంధులైన వారికి కలలు రావని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే కొన్ని మార్గాల ద్వారా మాత్రం అనుభూతి చెందుతారంటా. అయితే మధ్యలో అంధత్వం వచ్చినవారు అందరిలాగే కలలు కంటారు.
* పెద్దలకు కలలో ఎక్కువగా జంతువులు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
* కేవలం మనుషులు మాత్రమే కాకుండా క్షీరదాలన్ని కలల అనుభూతిని పొందుతాయని పరిశోధనలు చెబుతున్నారు.
* పడుకునే విధానం కూడా కలలపై ప్రభావం చూపుతుందని అంటున్నారు నిపుణులు చెబుతున్నారు. వెల్లకిలా పడుకుంటే పీడకలలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
* కలలన్నీ రంగుల్లోనే ఉండవని పరిశోధకులు చెబుతున్నారు. 1950 సమయంలో నిర్వహించిన అధ్యయనాల్లో కలలు ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్ వచ్చినట్లు తేలింది. అయితే 1960 తర్వాత రంగుల కలలు వస్తున్నట్లు ప్రజలు తెలిపారు. దీనికి టీవీలు, సినిమాలు కూడా కారణం కావొచ్చని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
నోట్: పైన తెలిపిన విషయాలు పలువురు నిపుణుల అభిప్రాయాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..