Flight: ఆకాశంలో విమానం ఇంజన్‌ ఆగిపోతే ఏమవుతుందో తెలుసా.?

భూమిపై నుంచి వేలాది అడుగుల ఎత్తులో వందలాది మంది ప్రయాణికులతో ప్రయాణించే విమానం ఎలా ప్రయణిస్తుందా అనే సందేహం అందరిలో ఉంటుంది. అయితే విమానం గాల్లో ప్రయణిస్తున్న సమయంలో ఒకవేళ ఇంజన్ పాడైతే ఏంటన్న సందేహం రావడం సర్వసాధారణం. అయితే నిజంగానే ఈ సమస్య ఎదురైతే పైలట్స్ ఏం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం..

Flight: ఆకాశంలో విమానం ఇంజన్‌ ఆగిపోతే ఏమవుతుందో తెలుసా.?
Flight
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 01, 2024 | 6:23 PM

సాధారణంగా కార్లు, బైక్‌లు రోడ్డుపై వెళ్తున్న సమయంలో వాహన ఇంజన్‌ పాడవుతుంటాయి. అయితే రోడ్డుపై వెళ్తున్న వాహనాలు కాబట్టి ఏదో రకంగా మ్యానేజ్‌ చేయొచ్చు. ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. అయితే గాల్లో ఎగిరే విమానంలో ఇలాంటి సమస్య ఎదురైతే పరిస్థితి ఏంటి.? ఊహించుకోవడానికి షాకింగ్‌గా ఉంది కదూ! ఇంతకీ గాల్లో విమానం ఇంజన్‌ ఆగిపోతే ఏమవుతుంది.? ఈ సమస్య నుంచి పైలెట్స్‌ విమానాన్ని ఎలా రక్షిస్తారు.? ఇప్పుడు తెలుసుకుందాం..

విమానం ఇంజన్‌ ఆగిపోయినప్పుడు, విమానాన్ని ముందుకు నడపడానికి అవసరమైన థ్రస్ట్ పోతుంది . ఈ పరిస్థితిలో విమానం గాలిలో గ్లైడింగ్ ప్రారంభమవుతుంది . గ్లైడింగ్ అనేది గాలి నిరోధకతకు వ్యతిరేకంగా విమానం ఎగరడానికి ఉపయోగపడే ప్రక్రియ. దీని ద్వారా విమానం కాసేపటి వరకు గాల్లోనే ఎగురుతుంది. అయితే ఇలా విమానం గాల్లో ఎంతదూరం వెళ్తుందన్నది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది.

సాధారణంగా పెద్ద విమానాలు, చిన్న విమానాలతో పోల్చితే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. విమానం ఎక్కువ ఎత్తులో ఉంటే, అది మరింత దూరం వెళ్లగలదు. ఇది కాకుండా, గాలి ప్రసరించే దిశ కూడా విమానం గ్లైడింగ్ దూరాన్ని ప్రభావితం చేస్తుంది. విమానం పయణిస్తున్న దిశకు వ్యతిరేక దిశలో గాలి వీస్తుంటే ఎక్కువ దూరం ముందుకు వెళ్లదు. ఇక విమానం సురక్షితంగా ల్యాండ్‌ చేయడంలో పైలట్‌ ముఖ్య పాత్ర పోషిస్తాడు.

అపారమైన అనుభవం ఉన్న పైలట్స్‌ అయితేనే ఎలాంటి ప్రమాదం లేకుండా విమానం సేఫ్ ల్యాండ్ అవుతుంది. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కూడా విమానం సేఫ్‌ ల్యాండ్‌కు కారణమవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న విమానాల్లో అధునాతన టెక్నాలజీని అందించారు. కొన్ని రకాల విమానాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ ఇంజన్లను అందిస్తున్నారు. దీంతో ఒక ఇంజన్‌ విఫలమైనా మరో ఇంజన్‌తో విమానాన్ని నడిపిస్తారు. కాబట్టి విమానాల్లో ఇంజన్‌ వైఫల్యం అనే సమస్యే ఉండదు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్  చేయండి..

రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!
రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!
మహాకుంభమేళా.. అఘోరాలు, నాగసాధువుల ఆశీర్వాదం కోసం భక్తుల పోటీ
మహాకుంభమేళా.. అఘోరాలు, నాగసాధువుల ఆశీర్వాదం కోసం భక్తుల పోటీ
కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే.
కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే.
కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నారా?..షాకింగ్ న్యూస్ మీకోసమే!
కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నారా?..షాకింగ్ న్యూస్ మీకోసమే!
నార్త్ అమెరికాలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్‌ల సునామీ!
నార్త్ అమెరికాలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్‌ల సునామీ!
సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!
సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!
అంతరిక్షంలో ఉపగ్రహాల గ్రాండ్‌ షేక్‌హ్యాండ్‌ విజయవంతం
అంతరిక్షంలో ఉపగ్రహాల గ్రాండ్‌ షేక్‌హ్యాండ్‌ విజయవంతం
కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ పప్పులను దూరం పెట్టాలి!
కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ పప్పులను దూరం పెట్టాలి!
AI తో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చా?
AI తో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చా?
ఏం యాక్టింగ్ చేశావే మొసలి..! మనుషులను తినేయడానికి మాస్టర్ ప్లాన్
ఏం యాక్టింగ్ చేశావే మొసలి..! మనుషులను తినేయడానికి మాస్టర్ ప్లాన్