సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!
సంక్రాంతి పండుగ అంటేనే పల్లెల్లో ఎక్కడలేని ఉత్సాహం ఉరకలెత్తుతుంది. ప్రతి ఇల్లు రంగుల ముగ్గులు, పిండి వంటలు, చుట్టాలతో కళకళలాడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం సంక్రాంతి పండుగ రోజు సంతకు వెళ్లి చనిపోయారని... పి కొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి పండుగను జరుపుకోవడమే మానేయడం వినడానికి కాస్త విచిత్రంగానే ఉన్నా... ఇది నిజం. అలా సంక్రాంతి పండుగకు దూరంగా పి. కొత్తపల్లి గ్రామం ఉండిపోయింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది. ప్రతీ పల్లె సంక్రాంతి వేడుకలతో కోలాహాలంగా ఉంది. కానీ ఆ గ్రామం వెలవెలబోతోంది. అసలు ఆ గ్రామంలో 200 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగే జరుపుకోరట. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పి. కొత్తపల్లి కథ ఇది. పి.కొత్తపల్లి గ్రామంలో గడిచిన 2వందల ఏళ్ళ నుంచి గ్రామస్తులు సంక్రాంతి పండుగ చేసుకోవడం లేదు. ఇంటి అలంకరణ… పూజలు, దీపారాధన కాదు కదా… కనీసం ఇంటి ముందు కళ్ళాపు చల్లి ముగ్గులు కూడా వేయరు. సంక్రాంతి పండుగ అంటేనే ఇంటి ముందు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలు కనిపిస్తాయి. కానీ పి కొత్తపల్లి గ్రామంలో ఏ సంక్రాంతి పండుగకు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టిందే లేదు. అసలు ఎందుకు పి. కొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి పండగే జరపరు అంటే… దానికి 200 ఏళ్ళ కిందటి కథే ఉందట. పి కొత్తపల్లి గ్రామంలోని తమ పూర్వీకులు సంక్రాంతి పండుగ రోజు సంతకు వెళ్లి… తిరిగి రాలేదని… సంక్రాంతి పండుగ రోజు సంతకి వెళ్లినవారు చనిపోయారన్నారు. ఆ పండుగ చేసుకుంటే అశుభం అని.. ఆ రోజు నుంచి ఈరోజు వరకు పి. కొత్తపల్లి గ్రామస్తులు సంక్రాంతి పండుగ చేసుకోవడం లేదు. దీంతో ఏకంగా సంక్రాంతి పండుగనే బహిష్కరించారు ఆ గ్రామస్తులు.
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

