సౌత్ సినిమాల పై ఫోకస్ పెట్టాలని చూస్తున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్..

Rajeev 

17 January 2025

Credit: Instagram

 చాలా మంది హీరోయిన్ పెళ్ళైనా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అలాగే దీపిక కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. 

దీపిక పదుకోన్‌ వరుసగా పఠాన్‌,  సింగం ఎగైన్, ప్రభాస్ కల్కి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. 

కల్కి సినిమా సమయానికి దీపికా నిండు గర్భిణీ.. ఇప్పుడు ఈ అమ్మడు పండంటి బిడ్డకు జన్మనించింది. 

బిడ్డపుట్టిన దగ్గర నుంచి ఫ్యామితోనే సమయాన్ని గడుపుతున్న దీపికా ఇప్పుడు తిరిగి సినిమాల పై దృష్టి పెట్టాలని చూస్తుందట. 

ఇక పై బాలీవుడ్ సినిమాలతో పాటు సౌత్ సినిమాల పై కూడా ఫోకస్ పెట్టాలని భావిస్తోందట ఈ అమ్మడు. 

ఇప్పటికే మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో దీపికా నటిస్తుందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు ప్రియాంక చోప్రా పేరు వినిపిస్తుంది. 

ఇదిలా ఉండగా రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న బ్రహ్మాస్త్ర2 లో దీపికా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. దీని పై ఇంకా క్లారిటీ రాలేదు.