అంతరిక్షంలో ఉపగ్రహాల గ్రాండ్ షేక్‌హ్యాండ్ విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించింది. ఇస్రో చేపట్టిన స్పేడెక్స్ మిషన్‌లో వ్యోమనౌకల అనుసంధాన ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతంగా పూర్తయింది. ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఇస్రో వర్గాలు తాజాగా వెల్లడించాయి.
స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన భారతీయ డాకింగ్ సిస్టమ్ విజయవంతం కావడం పట్ల ఇస్రో అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంతో స్పేస్ డాకింగ్ సాధించిన 4వ దేశంగా భారత్ అవతరించింది. ఈ విషయాన్ని ఇస్రో ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇస్రో 2024 డిసెంబర్ 30న రాత్రి 10:00:15 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్‌లో భాగంగా శాస్త్రవేత్తలు PSLV-C60 ద్వారా ఛేంజర్‌గా పిలుచుకునే SDX01, టార్గెట్‌గా భావించే SDX02 అనే రెండు శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించారు. ఈ శాటిలైట్లను PSLV-C60 విజయవంతగా నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అనంతరం SDX01, SDX02 ఉపగ్రహాలను రోదసిలో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ప్రయోగం విజయవంతం అవడంతో అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ చేరినట్లయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ పప్పులను దూరం పెట్టాలి!
ప్రాణాంతక వైరస్‌లను ముందే పసిగట్టి AI .. రాబోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందా?
ఏం యాక్టింగ్ చేశావే మొసలి..! మనుషులను తినేయడానికి మాస్టర్ ప్లాన్
అమ్మ కోసం విమానాన్నే ఆపించిన మహిళ..!
గ్యాస్ స్టవ్ ఆపకుండా నిద్రపోయిన స్నేహితులు.. తెల్లారేసరికి..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

