గ్యాస్ స్టవ్ ఆపకుండా నిద్రపోయిన స్నేహితులు.. తెల్లారేసరికి..
వారిద్దరూ ‘స్ట్రీట్ ఫుడ్’ విక్రయిస్తూ జీవితాన్ని గడుపుతున్న స్నేహితులు. మరుసటి రోజు నిర్వహించే వ్యాపారం కోసం గ్యాస్ స్టవ్‌పై శనగలు ఉడకబెట్టారు. కానీ, స్టవ్ ఆపకుండానే ఇద్దరూ నిద్రపోయారు. కొన్ని గంటల్లోనే ఇద్దరూ విగతజీవులయ్యారు. ఈ విషాదకర ఘటన నోయిడాలో జరిగింది. ఉపేంద్ర, శివమ్ అనే యువకులు నోయిడాలోని సెక్టార్ 70లో ఒక అద్దె ఇంట్లో ఉంటూ 'చోలే కుల్చే', 'భతురా' స్ట్రీట్ ఫుడ్ స్టాల్‌ను నిర్వహించే వారు.
ఎప్పటిలాగానే రాత్రి గ్యాస్ స్టవ్‌పై శనగలు ఉడకబెట్టారు. కానీ, స్టవ్ కట్టేయకుండానే నిద్రలోకి జారుకున్నారు. తలుపులు, కిటికీలు మూసి ఉండడంతో గది మొత్తం వాయువులు వ్యాపించాయి. శనగలతో పాటు ఉడకబెట్టిన పాత్ర కూడా మాడిపోవడంతో హానికర వాయువులు వెలుడ్డాయి. దీంతో, గదిలో కార్బన్ మోనాక్సైడ్ పరిమాణం పెరిగిపోయి ఆక్సిజన్ కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో కొన్ని గంటల్లో ఇద్దరూ ఊపిరాడక చనిపోయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని నోయిడా సెంట్రల్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ గుప్తా తెలిపారు. అపాయకరమైన పొగ కారణంగా ఇద్దరికీ ఊపిరాడలేదని రాజీవ్ గుప్తా వివరించారు. గదిలోంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు తలుపులు పగులగొట్టి చూడగా ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారని, వెంటనే సమీపంలోని హాస్పిటల్‌కు తరలించిగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారని అన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే ??
రోడ్డున పోయే వ్యక్తి ముక్కును కట్ చేసిన పతంగి మాంజా
అంతరిక్షంలో చైనా భారీ సోలార్ ప్రాజెక్ట్.. ఇది కనక పూర్తయితే..

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
