రోడ్డున పోయే వ్యక్తి ముక్కును కట్ చేసిన పతంగి మాంజా
పతంగుల పండుగ వస్తుందంటేనే.. పరేషాన్ మొదలవుతోంది.. చైనా మాంజాలు ఎంతమంది పాలిట ఉరితాళ్లుగా మారుతాయోనన్న టెన్షన్ స్టార్ట్ అవుతోంది. గత ఏడాది చైనా మాంజాకు హైదరాబాద్‌లో ఓ సైనికుడు బలవగా..పలువురు తీవ్రంగా గాయపడ్డారు.. ఈ ఏడాది మొదటివారంలో మూడ్రోజుల వ్యవధిలోనే.. ఏడుగురి ప్రాణాల మీదకు తెచ్చింది..ఈ డెడ్లీ దారం.
తాజాగా మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని భోగారంలో ఓ వ్యక్తి ముక్కుని కట్ చేసింది చైనా మాంజా. మేడ్చల్ జిల్లా భోగారంలో ఓ స్కూల్ నిర్వాకంతో రోడ్డుపై వెళుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి ముక్కు కట్ అయింది. సంక్రాంతి సెలబ్రేషన్స్ సందర్బంగా స్కూల్ చిన్నారులకు కైట్స్ ఎగరవేయమని యాజమాన్యం ఎంకరేజ్ చేసింది. పైగా వారికి చైనా మాంజా కూడా అరేంజ్ చేసిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఓ వైపు చైనా మాంజా అమ్మినా, కొన్నా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నా స్కూల్ యాజమాన్యం పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అంతరిక్షంలో చైనా భారీ సోలార్ ప్రాజెక్ట్.. ఇది కనక పూర్తయితే..
గర్భవతులను చేయండి.. లక్షలు సంపాదించండి..!

బీచ్లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్

నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది
