కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ పప్పులను దూరం పెట్టాలి!
మారిన జీవనశైలితో ఇటీవలి కాలంలో అధిక యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా పేరుకుపోవడం వల్ల... తీవ్ర నీరసం నుంచి మానసిక సమస్యల వరకు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. కిడ్నీల పనితీరు కూడా దెబ్బతింటుంది. భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన అనారోగ్య సమస్యలకూ దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అధికంగా మాంసాహారం, జంక్ ఫుడ్, ఫ్యాటీ ఫుడ్ తీసుకోవడం ఈ సమస్యకు కారణమని అంటున్నారు. ఇప్పటికే ఈ సమస్యతో బాధపడుతున్నవారు కొన్ని రకాల పప్పు ధాన్యాలకూ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. వాటితో యూరిక్ యాసిడ్ సమస్య పెరిగే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కిడ్నీల పనితీరు సరిగా లేనివారు కూడా ఈ పప్పు ధాన్యాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. బఠానీలు, శనగల్లో ప్యూరిన్స్ గా పిలిచే రసాయన సమ్మేళనాలు ఉంటాయి. అవి మన శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయులు పెరిగేందుకు కారణం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అదే తరహాలో రాజ్మా కిడ్నీ బీన్స్ లో, మినపపప్పులో కూడా ప్యూరిన్ ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. వీటిని అధికంగా తీసుకుంటే ఇబ్బందేనని పేర్కొంటున్నారు. కందిపప్పు, మైసూర్ పప్పులలో కూడా ప్యూరిన్స్ ఉంటాయని… అయితే వీటిని స్వల్ప మొత్తంలో తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదుగానీ, అధిక మొత్తంలో తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రాణాంతక వైరస్‌లను ముందే పసిగట్టి AI .. రాబోయే ప్రమాదాన్ని తగ్గిస్తుందా?
ఏం యాక్టింగ్ చేశావే మొసలి..! మనుషులను తినేయడానికి మాస్టర్ ప్లాన్
అమ్మ కోసం విమానాన్నే ఆపించిన మహిళ..!
గ్యాస్ స్టవ్ ఆపకుండా నిద్రపోయిన స్నేహితులు.. తెల్లారేసరికి..
సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే ??

బీచ్లో ‘బ్లడ్ రెయిన్’.. వీడియో వైరల్

నగరంలో భలే దొంగలు.. సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు రికార్డ్

విద్యార్ధులు అల్లరి తట్టుకోలేక.. గుంజీలు తీసిన మాస్టారు..!

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది
