ఏం యాక్టింగ్ చేశావే మొసలి..! మనుషులను తినేయడానికి మాస్టర్ ప్లాన్
మొసలి నీటిలో నివసించే భయంకరమైన క్రూర జంతువు. ఎవరైనా దాని బారినపడ్డారో..చావు ఖాయం అని చెప్పాలి. అడవికి రాజైన సింహం కూడా మొసలి పట్టునుండి తప్పించుకోలేదు. మొసళ్ళు తెలివితేటల్లో, వేటలో వ్యూహాత్మకంగా వ్యవహరించటంలో ముందుంటాయి. కానీ ఇప్పుడు ఈ ప్రమాదకరమైన జంతువు గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.
ఇండోనేషియాకు చెందిన మొసళ్లకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ఇండోనేషియాలోని ఉప్పునీటి మొసళ్లు మనుషులను నదిలోకి లాగేందుకు మునిగిపోయినట్లు నటించడం నేర్చుకున్నాయని ప్రచారం జరుగుతోంది. వైరల్ అవుతున్న వీడియోలో ఎవరో గుర్తు తెలియని మనిషి నీటిలో కొట్టుకుపోతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ, అది మొసలి.. దాని పంజాలు నీటిలో మునిగిపోతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది చూస్తే, ఒక వ్యక్తి మునిగిపోతున్నట్లు, సహాయం కోసం చూస్తున్నాడేమో అనిపిస్తుంది. మొసళ్లు ఇప్పుడు ఈ టెక్నిక్‌తో మనుషులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు. మొసళ్ల వేట వ్యూహానికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు మాత్రం భిన్నమైన అభిప్రాయాలను తెలియజేశారు. ఈ వీడియో చూసి చాలా మంది యూజర్లు షాకింగ్ కామెంట్లు చేశారు. ఇలా చేయడం వెనుక ఆ మొసలి అసలు ఉద్దేశం ఏమిటో ఎలా అర్థం చేసుకోవాలని మరికొందరు యూజర్లు వ్యాఖ్యానించారు. ఏదేమైనా ఈ మొసళ్లకు కాస్త తెలివి ఎక్కువే అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమ్మ కోసం విమానాన్నే ఆపించిన మహిళ..!
గ్యాస్ స్టవ్ ఆపకుండా నిద్రపోయిన స్నేహితులు.. తెల్లారేసరికి..
సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే ??
రోడ్డున పోయే వ్యక్తి ముక్కును కట్ చేసిన పతంగి మాంజా
అంతరిక్షంలో చైనా భారీ సోలార్ ప్రాజెక్ట్.. ఇది కనక పూర్తయితే..

ఆదమరిచి నిద్రపోతున్న శునకం.. మేక ఏం చేసిందో చూడండి

ఎండ వేడి తట్టుకోలేక ఏసీ ఆన్ చేస్తున్నారా.. అయితే జర జాగ్రత్త

మంచినీళ్లు అడిగి.. బంగారం దోచుకెళ్లాడు వీడియో

పిచ్చి పీక్స్‌కి.. వీడియో చూస్తే వణుకొస్తుంది

ఒక్క టూత్ బ్రష్‌తో దుమ్ము దులిపేసిందిగా..వీడియో

పెంపుడు కుక్కలను కిడ్నాప్ చేసి.. రూ.10 కోట్లు డిమాండ్ .. చివరికి

ఏసీ కోచ్‌ల్ ప్రయాణిస్తున్న వ్యక్తి.. పడుకుందామని రెడీ అవుతుండగా..
