అమ్మ కోసం విమానాన్నే ఆపించిన మహిళ..!
విదేశాల్లో ఉండే చాలామంది వ్యక్తులు ఒక్కోసారి వివిధ కారణాల వల్ల తల్లిదండ్రుల చివరి చూపునకు నోచుకోలేకపోతుంటారు. దీంతో తల్లిదండ్రులు ఆఖరి నిమిషంలో తమ పిల్లలను చూడకుండానే ప్రాణాలు వదిలేస్తారు. అలాంటి పరిస్థితే డాలస్‌కు చెందిన హన్నా వైట్ అనే మహిళకు ఎదురైంది. నార్త్ డకోటాలో నివసిస్తున్న తన తల్లి కాథ్లీన్ నెల్సన్ నిమోనియాతో బాధపడుతోంది.
ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో కొన్ని గంటలు మాత్రమే జీవించే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో హన్నా ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఎన్నో కష్టాలు పడి తనను యోగ్యురాలిని చేసిన తల్లిని చివరి చూపు చూసుకోవాలని తపనతో వెంటనే ఆమె డాలస్ నుంచి నార్త్ డకోటాకు డెల్టా ఎయిర్‌లైన్స్ లో టికెట్ బుక్ చేసుకుంది. అయితే సాంకేతిక కారణాల వల్ల డాలస్ ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తాను ప్రయాణించాల్సిన విమానం గంటపాటు ఆలస్యం అయ్యింది. దీంతో కనెక్టింగ్ ఫ్లైట్‌ను అందుకోలేనని ఆమె మరింత కుంగిపోయింది. ఇక తన తల్లిని ప్రాణాలతో చూసే అవకాశం లేదని తల్లడిల్లిపోయింది. తన పరిస్థితిని ఓ ఫ్లైట్ అటెండెంట్‌కు వివరించింది. వెంటనే స్పందించిన ఎయిర్‌లైన్స్ ఆమెకు మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. అంతే కాకుండా విమాన పైలట్ కెప్టెన్ కీత్ నపోలిటానో.. హన్నా వెళ్లాల్సిన కనెక్టింగ్ ఫ్లైట్ పైలట్‌ను సంప్రదించి ఆమె పరిస్థితిని వివరించి.. కొంత సమయం పాటు విమానాన్ని ఆపాలని కోరారు. దీంతో ఆ పైలట్ ప్రయాణికుల సహకారంతో విమానాన్ని దాదాపు 30 నిమిషాల పాటు నిలిపి ఉంచారు. హన్నా తన కనెక్టింగ్ ఫ్లైట్‌ను పట్టుకోగలిగింది. తన తల్లి చివరి క్షణాలలో ఆమె వద్ద ఉండేందుకు తనకు సహకరించిన డెల్టా ఎయిర్‌లైన్స్‌కు హన్నా సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. ఎయిర్ లైన్స్ సిబ్బంది సహాయం వల్లే తన తల్లితో ఎంతో విలువైన 24 గంటలు గడపగలిగానని.. మరుసటి రోజు ఆమె సంతోషంగా ప్రాణాలు విడిచిందని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గ్యాస్ స్టవ్ ఆపకుండా నిద్రపోయిన స్నేహితులు.. తెల్లారేసరికి..
సైఫ్ అలీఖాన్‌పై దుండగుడి దాడి.. కరీనా ఎలా తప్పించుకుందంటే ??
రోడ్డున పోయే వ్యక్తి ముక్కును కట్ చేసిన పతంగి మాంజా
అంతరిక్షంలో చైనా భారీ సోలార్ ప్రాజెక్ట్.. ఇది కనక పూర్తయితే..

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
