Foreign Travel Yoga: అనుకూలంగా శుక్రుడు.. ఆ రాశుల వారికి విదేశీయాన యోగం..!
జ్యోతిషశాస్త్రం ప్రకారం మీన రాశి విదేశాలకు సంబంధించిన రాశిగా పరిగణిస్తారు. మీన రాశిలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహ దశలో విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుందని భావిస్తారు. ఈ నెల 28 నుంచి శుక్రుడు మీన రాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టడం జరుగుతుంది. అందువల్ల శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్న రాశుల వారికి రకరకాల కారణాల వల్ల విదేశీయాన యోగం పడుతుంది.

Foreign Travel Yoga
జ్యోతిషశాస్త్రం ప్రకారం మీన రాశి విదేశాలకు సంబంధించిన రాశి. ఈ రాశిలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహ దశలో విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఈ నెల 28 నుంచి శుక్రుడు మీన రాశిలో ప్రవేశించి ఉచ్ఛపట్టడం జరుగుతుంది. అందువల్ల శుక్రుడు బాగా అనుకూలంగా ఉన్న రాశుల వారికి రకరకాల కారణాల వల్ల విదేశీయాన యోగం పడుతుంది. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, మీన రాశులకు తప్పకుండా విదేశీయాన అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు, విదేశాల్లోని వ్యక్తులతో పెళ్లి, విదేశీ సంపాదన అనుభవించే యోగం వంటివి తప్ప కుండా కలుగుతాయి.
- మేషం: ఈ రాశికి వ్యయ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల ఈ రాశివారు తప్పకుండా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. వ్యయ స్థానం బలంగా ఉన్న పక్షంలో తప్పకుండా విదేశీయాన యోగం కలుగుతుంది. ఎక్కువగా బంధువులను చూడడానికో, పర్యాటకంలో భాగంగానో విదేశాలకు వెళ్ల డం జరుగుతుంది. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో భాగంగా విదేశా లకు వెళ్లేవారు తప్పకుండా విజయం సాధిస్తారు. విదేశీ జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది.
- వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవ కాశం కలుగుతుంది. ఇబ్బడిముబ్బడిగా విదేశీ సంపాదన అనుభవించే యోగం ఉంది. నిరు ద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మీన రాశిలో శుక్రుడు ఉండగా విదేశాలకు వెళ్లిన ఉద్యోగులు అక్కడే స్థిరపడడం జరుగుతుంది. వ్యాపారపరంగా కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది.
- మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారి విదేశీ ప్రయత్నాలు తప్ప కుండా విజయవంతమవుతాయి. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి అన్ని విధాలుగానూ స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు స్వదేశీ అవకాశాల కన్నా విదేశీ అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొందరికి విదేశాల్లో సత్కారాలు, సన్మాహాలు లభించే అవకాశం ఉంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది.
- కర్కాటకం: ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల తప్పకుండా విదేశీయాన యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు విదేశాలకు వెళ్లి అత్యధికంగా సంపాదించడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. విదేశీయానానికి సంబంధించి కొద్ది ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. వీసా సమస్యలు పూర్తిగా పరిష్కారమైన విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు విజయాలు సాధిస్తారు.
- కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఫిబ్రవరి 28 లోపు ఈ రాశివారు విదేశాలకు వెళ్లడానికి అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో స్థిరపడిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న వ్యక్తితో ప్రేమలో పడే అవకాశం కూడా ఉంది. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఇప్పటికే స్థిరపడిన వారు అక్కడ స్థిరత్వం పాటు భారీగా ఆస్తిపాస్తులు సంపాదించుకునే అవకాశం కూడా ఉంది.
- మీనం: విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఈ రాశిలో శుక్రుడు ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారు అతి కొద్ది ప్రయత్నంతో విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యలకు, ఉద్యో గాలకు వెళ్లడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాల్లో కూడా విదేశీ సంబంధం కుదిరే అవకాశం ఎక్కు వగా ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారు అక్కడే స్థిరపడడం, స్థిరమైన ఉద్యోగ జీవితం లేదా వృత్తి జీవితం గడపడం జరుగుతుంది. అనేక పర్యాయాలు విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.