కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే..
ఓ యూట్యూబర్‌ను సాధువు చిడతలతో చితక్కొట్టి తరిమికొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ లోని కుంభమేళాలో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విషయంలోకి వెళితే.. ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా సోమవారం ఘనంగా ప్రారంభమైంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున సాధువులు పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం విచ్చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఓ యూట్యూబర్ అక్కడ కూర్చుని ధ్యానం చేసుకుంటున్న సాధువును ఇంటర్వ్యూ చేసే క్రమంలో తలతిక్క ప్రశ్నలు వేయడం సాధువుకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సాధువు చిడతలను తీసుకుని యూట్యూబర్‌ను బాదడంతో అతను పరారయ్యాడు. ఇంతకూ సాధువుకు ఎందుకు కోపం వచ్చిందంటే.. మీరు సాధువుగా ఎప్పుడు మారారు? అని యూట్యూబర్ ప్రశ్నించగా, చిన్నప్పుడే అని సమాధానం ఇచ్చాడు. యూట్యూబర్ అంతటితో ఆగకుండా దేవుడి కోసం మీరు ఏ భజనలు చేస్తారని ప్రశ్నించాడు. దీంతో తిక్కరేగిన సాధువు పక్కనే ఉన్న చిడతలను తీసుకుని పిచ్చిప్రశ్నలు అడుగుతావా? అంటూ వీరబాదుడు బాదడంతో సదరు యూట్యూబర్ సాధువు గుడారం నుంచి పారిపోయాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఇతరులు ఈ ఘటనను రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది.
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

