నార్త్ అమెరికాలో కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తున్న సంక్రాతికి వస్తున్నా మూవీ!
సంక్రాంతి సినిమాల వసూళ్లు పోట్ల గిత్తెల వలె పరుగులు పెడుతున్నాయి. తాజాగా సంక్రాంతి నాడు రిలీజ్ అయిన వెంకటేశ్ సినిమా ఓ రేంజ్‌లో విక్టరీ మోత మోగిస్తోంది. వెంకీ మామ ఆల్రెడీ కలెక్షన్ల సునామీ షురూ చేశాడు. విక్టరీ వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా బ్లాక్‌బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన హైలీ యాంటిసిపేటెడ్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి కానుకగా మంగళవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
తాజాగా ఈ సినిమా కొన్ని గంటల్లోనే నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 350K డాల్లర్స్ వసూళ్లను సాధించినట్లు సమాచారం. విషయాన్నీ మేకర్స్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల నుండి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశముంది. ప్రతీ సంక్రాంతి ఆనవాయితీ మాదిరిగానే ఈసారి కూడా చివరగా రిలీజ్ అయినా సినిమా కలెక్షన్స్ ఎగరేసుకుపోతోంది. ఇప్పటికే నెటిజన్స్ ఈ సినిమాకి మంచి మార్క్స్ వేస్తున్నారు. ఈ సినిమా కంప్లీట్ ఫెస్టివల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. బుల్లి రాజు పాత్రలో వెంకీ ఆకట్టుకున్నాడు అంటున్నారు. ప్రత్యేకంగా మ్యూజిక్ సినిమాని ఎలివేట్ చేసిందని టాక్. ఇక క్రాఫ్ట్ పరంగా చూసుకుంటే సినిమా డీసెంట్ గానే ఉందని చెబుతున్నారు. మరోవైపు దర్శకుడు అనిల్ రావిపూడి తన రొటీన్ కామెడీ ట్రాక్‌ను మరోసారి ప్రయోగించి సక్సెస్ అయినట్లు చెబుతున్నారు.
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

