AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: ఏపీకి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అందుకోసమే..

మొన్న మోదీ వచ్చారు... ఇప్పుడు అమిత్‌ షా వస్తున్నారు..! దీంతో కూటమి నేతల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. మోదీ పర్యటించిన వారం గ్యాప్‌లోనే అమిత్ షా పర్యటన ఎందుకోసం... అమిత్‌ షా టూర్‌ అజెండా ఏంటి..? ఆయన పాల్గొనేది పార్టీ కార్యక్రమాల్లోనా.. అధికారిక కార్యక్రమాల్లోనా... డీటెయిల్స్‌ తెలుసుకుందాం పదండి...

Andhra News: ఏపీకి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అందుకోసమే..
Amit Shah
Ram Naramaneni
|

Updated on: Jan 17, 2025 | 9:02 PM

Share

ఏపీకి కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే విశాఖపట్నంలో పర్యటించిన ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారు. ఈ పర్యటన కోసం శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌ షాకు ఘన స్వాగతం పలకాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అక్కడి నుంచి ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి అమిషాకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. తర్వాత, విజయవాడలోని హోటల్‌కు చేరుకుని అక్కడ బస చేస్తారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. అమిత్‌ షా ప్రారంభించే NIDM, NDRF ప్రాంతాలను పరిశీలించారు. అలాగే సభ తదితర అంశాలపై అందుబాటులో ఉన్న అధికారులుతో చర్చించారు. అమిత్ షా సభా ప్రాంగణానికి చేరుకుని… వెళ్లేంత వరకు జరిగే కార్యక్రమాల వివరాలుపై కొద్దిసేపు అధికారులుతో పురంధేశ్వరి సమీక్ష నిర్వహించారు.

మరోవైపు మోదీ పర్యటించన వారం గ్యాప్‌లోనే అమిత్ షా కూడా వస్తుండటంతో.. రాష్ట్రంలోని ఎన్డీఏ నేతల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. అమిత్ షాకు ఘన స్వాగతం పలికేందుకు.. ఎన్డీఏ నేతలు రెడీ అయ్యారు. కేంద్రం మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..