AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Special Trains: గుడ్ న్యూస్.. సంక్రాంతి రద్దీ వేళ మరిన్ని ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు

Railway Passenger Alert: సంక్రాంతి రద్దీ వేళ తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. చాలా వరకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఆ మేరకు 8 ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను ద.మ.రైల్వే ప్రకటింది.

Special Trains: గుడ్ న్యూస్.. సంక్రాంతి రద్దీ వేళ మరిన్ని ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు
Sankranti Special Trains
Janardhan Veluru
|

Updated on: Jan 17, 2025 | 6:19 PM

Share

సంక్రాంతి రద్దీ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల మధ్య దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటికి అదనంగా మరో 8 ప్రత్యేక రైళ్లను పలు ప్రాంతాల మధ్య నడపనున్నట్లు శుక్రవారంనాడు ప్రకటించింది. కాకినాడ టౌన్ – చర్లపల్లి ప్రత్యేక రైలు (నెం.07215)ను జనవరి 18న నడపనుంది. అలాగే నర్సాపూర్ – చర్లపల్లి ప్రత్యేక రైలును జనవరి 19న, విశాఖపట్నం – చర్లపల్లి ప్రత్యేక రైలును జనవరి 18న రెండు సర్వీసులు, 19 తేదీన ఒక సర్వీసు, చర్లపల్లి – విశాఖపట్నం ప్రత్యేక రైలును జనవరి 19, 20 తేదీన నడపనుంది. చర్లపల్లి – భువనేశ్వర్ ప్రత్యేక రైలును జనవరి 19న రైల్వే శాఖ నడపనుంది.

ప్రత్యేక రైళ్లు ఆగే రైల్వే స్టేషన్లు

కాకినాడ టౌన్ – చర్లపల్లి ప్రత్యేక రైలు సామర్లకోట, రాజమండ్రి నిడదవోలు, తణుకు, భీవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట్, జనగామ స్టేషన్లలో ఆగనుంది.

నర్సాపూర్ – చర్లపల్లి ప్రత్యేక రైలు పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట్, జనగామ స్టేషన్లలో ఆగనుంది.

విశాఖపట్నం – చర్లపల్లి మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ స్టేషన్లలో ఆగనున్నాయి.

చర్లపల్లి – భువనేశ్వర్ ప్రత్యేక రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట్, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, బలుగాన్, ఖర్దా రోడ్ స్టేషన్లలో ఆగనుంది.

Special Trains

Special Trains

ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్ ఎకానమీ, స్లీపర్ కోచ్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!