AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!

రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!

Samatha J
|

Updated on: Jan 17, 2025 | 7:58 PM

Share

రష్యా-ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘంగా జరుగుతున్న యుద్ధంలో మరో భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. రష్యా సైన్యంలో పనిచేస్తున్న కేరళకు చెందిన టీబీ బినిల్ మృతి చెందగా, ఆయన సమీప బంధువు టీకే జైన్ గాయపడ్డాడు. యుద్ధంలో బినిల్ చనిపోయినట్టు రష్యా రాజధాని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం తెలిపిందని ఆయన బంధువులు తెలిపారు. బినిల్‌ను రష్యా నుంచి సురక్షితంగా వెనక్కి తీసుకురావాలని ఆయన భార్య.. అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్న సమయంలోనే ఈ ఘటన జరగడం అందరినీ షాక్‌కు గురిచేసింది.

త్రిసూర్‌కు చెందిన బినిల్, టీకే జైన్ ఇద్దరూ ఐటీఐ మెకానికల్ డిప్లొమా పూర్తి చేశారు. అనంతరం ఉద్యోగాల నిమిత్తం ఓ ఏజెంటు ద్వారా ప్రైవేటు వీసాలతో గతేడాది ఏప్రిల్‌లో రష్యా చేరుకున్నారు. అక్కడికి వెళ్లాక వీరి పాస్‌పోర్టులను రద్దు చేసిన అక్కడి అధికారులు రష్యా మిలటరీ సపోర్ట్ సర్వీస్‌లో భాగంగా యుద్ధానికి పంపారు. విషయం తెలిసి వారిని వెనక్కి రప్పించాలంటూ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వానికి విన్నవించారు. అందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతుండగానే బినిల్ మరణించడం, జైన్ గాయాలపాలు కావడంతో స్వగ్రామంలో విషాదం అలముకుంది. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో భారతీయులు కొందరు రష్యా సైన్యానికి సహాయకులుగా పనిచేస్తున్నారు. వారిని తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ గతంలో లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో అడిగిన ప్రశ్నకు అన్నారు. రష్యాలో పర్యటించిన ప్రధాని సైతం ఇదే విషయంపై పుతిన్‌తో చర్చించారు.

మరిన్ని వార్తల కోసం :

గేమ్ ఛేంజ‌ర్ మూవీ ఫ‌స్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!

 

 

Published on: Jan 17, 2025 07:56 PM