Diwali 2024: వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు.. ఓం జై జగదీష్ హరే సాంగ్ ప్లే చేసిన యుఎస్ మిలిటరీ బ్యాండ్..

అగ్రరాజ్యం అమెరికాలోని వైట్‌హౌస్‌లో దీపావళి కార్యక్రమంలో అక్కడ సైనిక బృందం "ఓం జై జగదీష్ హరే" అనే భక్తిగీతాన్ని ప్లే చేశారు. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఫస్ట్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ ఈ వీడియోను ఎక్స్‌లో షేర్ చేశారు.

Diwali 2024: వైట్ హౌస్ లో ఘనంగా దీపావళి వేడుకలు.. ఓం జై జగదీష్ హరే సాంగ్ ప్లే చేసిన యుఎస్ మిలిటరీ బ్యాండ్..
Diwali Celebrations In Us
Follow us
Surya Kala

|

Updated on: Nov 01, 2024 | 12:53 PM

దివ్వెల పండగ దీపావళిని భారత దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. పలు దేశాలు దీపావళి పండగను అధికారకంగా సెలవు దినంగా ప్రకటించాయి కూడా.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలోని వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇప్పటికే వైట్‌హౌస్‌లో భారతీయులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో ఇప్పటి వరకు భారీ దీపావళి వేడుకలను నిర్వహించడం గర్వంగా ఉందని చెప్పారు. అంతేకాదు సెనేటర్, వైస్ ప్రెసిడెంట్, దక్షిణాసియా అమెరికన్లు తన యంత్రాంగంలో కీలక సభ్యులుగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ దీపావళి వేడుకలను నిర్వహించే సమయంలో అమెరికన్ మిలిటరీ బ్యాండ్ హిందీ భక్తిగీతమైన ‘ఓం జై జగదీష్ హరే’ని ప్లే చేస్తున్న వీడియో సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ X లో వైరల్‌గా మారింది. గీతా గోపీనాథ్ అమెరికన్ మిలిటరీ బ్యాండ్ మెస్మరైజింగ్ వీడియోను షేర్ చేశారు.

అంతేకాదు యునైటెడ్ స్టేట్స్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కూడా దీపావళి వేడుకను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ, పెన్సిల్వేనియా, టెక్సాస్‌ రాష్ట్రాలు దీపావళిని అధికారికంగా సెలవు దినంగా గుర్తించిన సంగతి తెలిసిందే. గురువారం సాయంత్రం అమెరికాలోని ఐకానిక్ ల్యాండ్ మార్క్‌లు దివ్వెల కాంతిలో వెలుగొందాయి. నిత్యం బిజీగా ఉండే ప్రవాస భారతీయులు ఒక చోట చేరి పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. దీపావళిని భారత్‌లో అక్టోబర్ 31, నవంబర్ 1వ తేదీన జరుపుకుంటున్నారు.

దీపావళి పండగ యునైటెడ్ స్టేట్స్‌లో వెలుగులు నింపుతోంది. ఉత్సాహపూరితమైన వేడుకలతో ప్రవాస భారతీయులను ఏకం చేసింది. వైట్ హౌస్ లో దీపావళి వేడుకలు మాత్రమే కాదు .. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌లలో అద్భుతమైన లైట్లతో దీపావళి సందడి నెలకొంది. న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ ప్లాజాలో దీపావళి పండుగ ప్రారంభమైంది. అయితే టెక్సాస్ లో బాణసంచా అమ్మకాలను చట్టబద్ధం చేసింది.

టైమ్స్ స్క్వేర్‌లో దీపావళి వెలుగులు నింపింది.

న్యూయార్క్‌లో వేడుకలు కొత్త స్థాయికి చేరుకున్నాయి. కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాకి చెందిన అధికారిక X ఖాతా @IndiainNewYork, టైమ్స్ స్క్వేర్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. “ప్రపంచంలోని క్రాస్‌రోడ్స్-టైమ్స్ స్క్వేర్ నుండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు!” పండుగ సందేశంలో భాగంగా అందరి ఆనందం, శ్రేయస్సును కోరుకుంటున్నట్లు కాన్సులేట్ రాసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?