Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hazelnut Health Benefits: ఈ చిన్న గింజలు బాదం, వాల్‌నట్స్‌ కంటే రెట్టింపు ప్రయోజనం..! ఎముకలను ఐరన్‌ రాడ్లుగా మార్చేస్తాయ్‌..

హజెల్‌ నట్స్‌ తినడం వల్ల అందం, ఆరోగ్యానికి ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. హాజెల్ నట్స్ ఆరోగ్యానికి పవర్‌హౌస్‌గా చెబుతున్నారు.. హాజెల్ నట్స్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న యాంటీఆక్సిడెంట్. ఇకపోతే, హాజెల్‌ నట్స్‌ తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Hazelnut Health Benefits: ఈ చిన్న గింజలు బాదం, వాల్‌నట్స్‌ కంటే రెట్టింపు ప్రయోజనం..! ఎముకలను ఐరన్‌ రాడ్లుగా మార్చేస్తాయ్‌..
Hazelnuts
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 01, 2024 | 4:34 PM

డ్రై ఫ్రూట్స్ మంచి ఆరోగ్యానికి మేలైన ఆహారంగా చెబుతారు. ఎందుకంటే వీటికి శరీరానికి బలాన్ని ఇచ్చే సత్తా ఉంది. డ్రై ఫ్రూట్స్‌లో బాదం, వాల్‌నట్ వంటివి మరింత ప్రయోజనకరంగా ఉంటాయని మనందరికీ తెలిసిందే. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి రక్షిస్తాయి. అయితే, ఈ డ్రైఫ్రూట్స్‌లో ఆరోగ్యపరంగా చూస్తే బాదం, వాల్‌నట్‌ల కంటే హాజెల్ నట్స్‌ అత్యంత ప్రభావంతమైనవిగా చెబుతున్నారు పోషకాహార నిపుణులు.

హజెట్‌ నట్స్‌లో ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. హాజెల్ నట్ చాలా తీపిగా ఉంటుంది. దీన్ని పచ్చిగా, లేదంటే ఆవిరిలో ఉడికించి లేదా వేయించి తినవచ్చు. ఇది అనేక వంటకాలకు రుచి కోసం ఉపయోగిస్తారు. కాఫీ, కేక్‌ల తయారీలోనూ హాజెల్‌నట్‌లను ఉపయోగిస్తారు. ఇది స్వీట్లకు అలంకరణగా ఉపయోగిస్తారు. ఇది వెన్న, నూనె, పిండి మొదలైన వాటి తయారీకి ఉపయోగిస్తారు.

హాజెల్ నట్స్‌లో ఉండే మోనోశాచురేటెడ్ కొవ్వులు, పాలీసాచురేటెడ్ కొవ్వులు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. విటమిన్ ఇ అధికంగా ఉండే హాజెల్ నట్స్ చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా మార్చడంలో సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

హాజెల్ నట్స్ లో విటమిన్ బి6, విటమిన్ ఇ, ఫోలేట్ ఉండటం వల్ల ఇది మెదడుకు పదును పెట్టడంలో సహాయపడుతుంది. హాజెల్ నట్స్‌లో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ల కారణంగా, క్యాన్సర్‌ను నివారించవచ్చు. క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. హాజెల్ నట్ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధిక స్థాయిలో ఉంటాయి. వీటిని ప్రోంటోసైనిడిన్స్ అంటారు. హాజెల్ నట్ లో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది క్యాన్సర్‌తో సంబంధం ఉన్న కణజాల నష్టాన్ని నివారిస్తుంది.

హాజెల్‌నట్‌లో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి, ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. హాజెల్ నట్ ఎముక ఖనిజ సాంద్రతను పెంచుతుంది. అస్థిరత, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది. రెగ్యులర్ గా హాజెల్ నట్స్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చునని నిపుణులు చెబతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.