ఒకే ఒక్కడు.. ఏకంగా 400 మందికి పైగా లైంగికంగా.. వెలుగులోకి బిలియనీర్ నిర్వాకం..!

దాదాపు 30 ఏళ్లపాటు మహమ్మద్‌ అల్‌ ఫాయిద్‌ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు.

ఒకే ఒక్కడు.. ఏకంగా 400 మందికి పైగా లైంగికంగా.. వెలుగులోకి బిలియనీర్ నిర్వాకం..!
Mohammed Al Fayed
Follow us

|

Updated on: Nov 01, 2024 | 11:36 AM

ఒకే ఒక్కడు ఏకంగా 400 మందిని లైంగికంగా వేధించాడు. బ్రిటన్‌లో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈజిప్ట్‌ బిలియనీర్‌ మహమ్మద్‌ అల్‌ ఫాయిద్‌ తమను లైంగికంగా వేధించాడని వందలాది మంది బాధితులు యూకే లాయర్లను ఆశ్రయిస్తున్నారు. బ్రిటన్‌లో హారోడ్స్‌ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్‌ యజమాని తమపై లైంగిక దాడికి పాల్పడ్డాడని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే ఆయన 2023లోనే మరణించాడు. ఈనేపథ్యంలో “ది జస్టిస్‌ ఫర్‌ హారోడ్స్‌ సర్వైవర్స్‌ గ్రూప్‌” సంస్థను ఇప్పటివరకు 421 మంది మహిళలు ఆశ్రయించారు.

దాదాపు 30 ఏళ్లపాటు మహమ్మద్‌ అల్‌ ఫాయిద్‌ మహిళలపై లైంగిక దాడులకు పాల్పడ్డట్లు ఫిర్యాదులు అందాయని పోలీసులు చెబుతున్నారు. బాధితుల్లో కొందరు స్టోర్‌కు సంబంధించిన మహిళలు కాగా.. మరికొందరు ఫల్‌హామ్‌ ఫుట్‌బాల్‌ క్లబ్‌, పారిస్‌లోని రిట్జ్‌ హోటల్‌ ఇతర సంస్థలకు చెందినవారు ఉన్నారు. అల్‌ ఫాయిద్‌ చేసిన అరాచకాలకు చుట్టుపక్కల ఉన్నవారు సహకరించడంతో అతడి పాపాల చిట్టా పెరిగిపోయిందని న్యాయవాదులు అంటున్నారు. బాధితుల్లో చాలావరకు యూకేకు చెందినవారే ఉన్నారు. కానీ, తమను ప్రపంచం నలుమూలల నుంచి పలువురు సంప్రదిస్తున్నట్లు వెల్లడించారు. అల్‌ఫాయిద్‌ తన చుట్టుపక్కల ఉన్న ప్రతి యువతిని టార్గెట్‌ చేసేవాడని తెలిపారు.

బ్రిటన్‌లోని అత్యంత సంపన్న కుటుంబాల్లో అల్‌ ఫాయిద్‌లు ఒకరు. మహమ్మద్‌ కుమారుడు దోడీ అల్‌ఫాయిడ్‌, బ్రిటన్‌ మాజీ రాణి డయానాతో ప్రయాణిస్తూ.. 1997లో జరిగిన రోడ్డు ప్రమాదంలో డయానాతో సహా ప్రాణాలు కోల్పోయాడు. ఇక మహమ్మద్‌ అల్‌ ఫాయిద్‌ 94 ఏళ్ల వయసులో గతేడాది ఆగస్టులో మరణించాడు. అతడు 1985లో హారోడ్స్‌ను కొనుగోలు చేశాడు. ఆరేళ్ల తర్వాత ఫ్రాన్స్‌లోని రిట్జ్‌ హోటల్‌ను దక్కించుకున్నాడు. ఇక 1997లో ఫల్‌హామ్‌ జట్టును సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆయన మరణించిన తర్వాత లైంగిక ఆరోపణలు రావడం సంచలనంగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..