విమానం దిగుతుండగా కుప్పకూలిన పాక్ అధ్యక్షులు.. కాలు విరిగి ఆసుపత్రిపాలు..!

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ విమానం నుండి దిగుతుండగా, అదుపుతప్పి పడిపోయారు. దీంతో ఆయన కాలు విరిగింది.

విమానం దిగుతుండగా కుప్పకూలిన పాక్ అధ్యక్షులు.. కాలు విరిగి ఆసుపత్రిపాలు..!
Pakistan President Asif Ali Zardari
Follow us

|

Updated on: Nov 01, 2024 | 10:04 AM

పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ బుధవారం గాయపడ్డారు. పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ బుధవారం(అక్టోబర్ 30) దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు, అక్కడ విమానం నుండి దిగుతుండగా, అదుపుతప్పి పడిపోయారు. దీంతో ఆయన కాలు విరిగింది. అయితే ఈ విషయాన్ని ఆయన కార్యాలయం గురువారం వెల్లడించింది. రాష్ట్రపతి భవన్ నుండి అందిన సమాచారం ప్రకారం, కిందపడిపోయిన తరువాత, అతన్ని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

చెకప్ తర్వాత, వైద్యులు అతని కాలికి ప్లాస్టర్‌ వేశారు. ఈ ప్లాస్టర్ అతని కాలికి నాలుగు వారాలు అంటే ఒక నెల పాటు ఉంటుందని చెబుతున్నారు. దీంతోపాటు, అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపినట్లు తెలుస్తోంది. పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. 69 ఏళ్ల అధ్యక్షుడు అసిఫ్ అలీ గత కొన్నేళ్లుగా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు.

గత ఏడాది మార్చిలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అతనికి కంటి శస్త్రచికిత్స జరిగింది. 2022 సంవత్సరంలో, ఛాతీ ఇన్ఫెక్షన్ చికిత్స కోసం అతను ఒక వారం పాటు కరాచీలోని డాక్టర్ జియావుద్దీన్ హాస్పిటల్‌లో చేరారు. అయితే, అతని అనారోగ్య పుకార్ల మధ్య, అతని వ్యక్తిగత వైద్యుడు, సన్నిహిత స్నేహితుడు డాక్టర్ అసిమ్ హుస్సేన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో అతని ఆరోగ్యం గురించి సమాచారం ఇస్తూ, అతను పూర్తిగా క్షేమంగా ఉన్నారని చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..