Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాములను ఎక్కువగా ఆకర్షించే ఇలాంటివి మీ పరిసరాల్లో ఉంటే ప్రమాదమే..! వెంటనే తీసేయండి..

చాలా మంది ఇప్పటికీ తమ ఇళ్లలో పాముల బెడదతో విసిగిపోతుంటారు. పాముల సంచారంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం భయంగా జీవిస్తుంటారు..కానీ, అలాంటి ఇంటి సరిసరాల్లో పాములను ఆకర్షించే వస్తువులు, మొక్కలు ఉన్నాయని వారు గ్రహించారు.. అందుకే పాములు తరచుగా ఇళ్లలోకి వస్తుంటాయి. అయితే, పాములను ఎక్కువగా ఆకర్షించేవి ఏంటీ..? ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్న చోట పాముల సంచారం ఎక్కువగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..

పాములను ఎక్కువగా ఆకర్షించే ఇలాంటివి మీ పరిసరాల్లో ఉంటే ప్రమాదమే..! వెంటనే తీసేయండి..
Attracting Snakes
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 10, 2025 | 1:12 PM

సాధారణంగా పాములంటే అందరికీ భయం..ఎందుకంటే.. పాములు చాలా విషపూరితమైనవి. విషపూరిత పాము కాటు వల్ల చాలా మంది ప్రాణాలు కొల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. పాములు ఎక్కువగా వాటికి కావాల్సిన ఆహారం, ఆవాసం కోసం వెచ్చని ప్రదేశాలను వెత్తుక్కుంటూ వస్తుంటాయి. దట్టమైన చెట్లు, చెత్త, పరిశుభ్రత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎలుకలు ఎక్కువగా కనిపిస్తాయి. ఆ ఎలుకలను తినడానికి పాములు అక్కడికి వస్తాయి.

పంట పొలాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలలో కూడా పాములు కనిపిస్తాయి. పాములు కొన్ని వస్తువులు లేదా మొక్కలకు ఆకర్షితులవుతాయి. అందుకే వాటిని ఇళ్లలో ఉంచకూడదని అంటున్నారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో పాములు సువాసన వెదజల్లే మొక్కలను ఇష్టపడతాయి. చాలా మంది తమ ఇళ్లలో మల్లె, జాజి, పారిజాత మొక్కలను పెంచుతారు. ఇవి పాములను బాగా ఆకర్షిస్తాయి. దీని కారణంగా పాములు వాటి కింద నివసిస్తాయి. కొన్ని సార్లు అక్కడ గూడు కట్టుకుంటాయి. అందుకే పాములను దూరంగా ఉంచడానికి ఇళ్ల చుట్టూ, వరండాలలో అలాంటి చెట్లను పెంచకూడదని అంటారు. ఇంకా, చెట్లను పెంచినప్పటికీ, చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు అక్కడ శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతున్నారు.

అలాగే, ఇళ్లల్లో ధాన్యం ఎక్కువగా నిల్వ ఉంచినప్పుడు కూడా పాములు చేరే అవకాశం ఉంటుంది.. ఎలాగంటే.. ఆ ధాన్యం కోసం ఎలుకలు వస్తుంటాయి. వాటి కోసం పాములు కూడా వస్తుంటాయి. అలాగే, మొగలి చెట్టును ఇంట్లో పెంచకూడదని అంటారు. ఎందుకంటే.. పాములు ఎక్కువగా మొగలి చెట్టు కింద నివసిస్తాయి. అది వెదజల్లుతున్న వాసనలు పాములను మీ ఇంటికి ఆకర్షిస్తాయి. అందుకే అది మీ ఇంట్లోకి ఎప్పుడూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అలాగే, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే, పాము కాటును నివారించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..