Beauty Tips: నల్లబడిన స్కిన్‌కు స్ట్రాబెర్రీ రెమిడీ..! సింపుల్ టిప్స్ మీకోసం..!
తీవ్రమైన ఎండల ప్రభావంతో ముఖంపై టాన్ పేరుకుని చర్మం నల్లబడిందా..? ఈ సమస్యను స్ట్రాబెర్రీస్ సహాయంతో తగ్గించుకోవచ్చు. స్ట్రాబెర్రీస్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణ అందించి సహజ మెరుపును ఇచ్చే గుణాలు కలిగి ఉంటాయి. ఎండ వల్ల కేవలం టాన్ మాత్రమే కాదు, చర్మం పొడిబారడం, మృతకణాలు పేరుకుపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. ఈ పరిస్థితిని సహజమైన మార్గాల్లో నియంత్రించేందుకు ఇంట్లోనే ఫేస్ మాస్క్ తయారు చేసుకోవచ్చు.

స్ట్రాబెర్రీస్ సహజంగా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. సాఫ్ట్, హెల్తీ స్కిన్ కోసం ఇంట్లోనే కొన్నిపదార్థాలతో ఫేస్ మాస్క్ తయారుచేసుకోవచ్చు. మార్కెట్‌లో లభించే కెమికల్ ప్రోడక్ట్స్ ఉపయోగిస్తే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇంట్లో తయారు చేసుకునే మాస్క్ వల్ల అలాంటి సమస్యలు ఉండవు. స్ట్రాబెర్రీ ఫేస్ మాస్క్ ఉపయోగించుకుంటే ముఖం సహజంగా అందంగా మెరుస్తుంది.
ఈ ఫేస్ మాస్క్ చర్మంపై పేరుకున్న మృతకణాలను తొలగించి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. స్ట్రాబెర్రీస్‌లో ఉన్న విటమిన్ సి, సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణ అందిస్తాయి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
- 5 పండిన స్ట్రాబెర్రీస్
- 1 టీస్పూన్ తేనె
- 2 టీస్పూన్ల ఓట్స్ పొడి
తయారీ విధానం
- స్ట్రాబెర్రీలను క్లీన్ చేసి గుజ్జులా చేయాలి.
- ఇందులో ఓట్స్ పొడి, తేనె వేసి బాగా కలపాలి.
- ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిన ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఉంచాలి.
- తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి.
- ఈ ఫేస్ మాస్క్‌ను వారానికి రెండు సార్లు వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది.
స్ట్రాబెర్రీ మాస్క్ ప్రయోజనాలు
- స్ట్రాబెర్రీస్‌లో ఉండే విటమిన్ సి చర్మానికి సహజమైన ప్రకాశం తెస్తుంది.
- తేనెలో సహజమైన మాయిశ్చరైజింగ్ గుణాలు ఉండటంతో చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.
- చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించి, మృదువైన స్కిన్ అందిస్తుంది.
- స్ట్రాబెర్రీస్, ఓట్స్ కలయిక వల్ల ముఖంపై ఉండే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తగ్గిపోతాయి.
ఈ సహజమైన ఫేస్ మాస్క్ ఉపయోగించి ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ఇది ఎలాంటి హానికరమైన కెమికల్స్ లేకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి.