Iron Rust Cleaning : మీ ఇంట్లో ఉన్న ఇనుము వస్తువులపై తుప్ప పడితే ఇలా క్లీన్‌ చేయండి.. మళ్లీ కొత్తదనం వస్తుంది..

ఇప్పుడు దానికి 3-4 చుక్కల నీటిని కలిపి మందపాటి పేస్ట్‌ను తయారు చేయండి. ఈ పేస్ట్‌ను తుప్పు మీద అప్లై చేసి 5 నిమిషాలు అలాగే ఉంచండి. 5 నిమిషాల తర్వాత, ఉప్పు కాగితంతో ఇనుముపై తుప్పును శుభ్రం చేయండి. ఈ విధంగా ఇనుముపై ఉన్న తుప్పు చాలా సులభంగా శుభ్రం తొలగిపోతుంది.

Iron Rust Cleaning : మీ ఇంట్లో ఉన్న ఇనుము వస్తువులపై తుప్ప పడితే ఇలా క్లీన్‌ చేయండి.. మళ్లీ కొత్తదనం వస్తుంది..
Iron Rust Cleaning
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 21, 2024 | 6:06 PM

మన ఇళ్లలో చాలా ఇనుప వస్తువులు ఉంటాయి. చాలా ఇళ్లకు గేట్లు, కిటికీలు ఇనుముతో తయారు చేస్తారు. అటువంటి పరిస్థితిలో గేట్లపై నీరు పడుతుంది. దీని కారణంగా ఇనుప గేటు తుప్పుపడుతుంది. చాలా సార్లు గేటు తుప్పు పట్టడం వల్ల పాడైపోవడంతో దాన్ని మార్చాల్సి వస్తుంది. మీ ఇంట్లో కూడా ఐదేనా ఐరన్ వస్తువు తుప్పు పట్టినట్లయితే దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక అవస్థలు పడుతున్నారా..? అలాంటప్పుడు చింతించకండి..ఎందుకంటే..తుప్పు పట్టిన ఐరన్‌ వస్తువులను తిరిగి కొత్తవిగా మార్చే ట్రిక్‌ తెలిసింది.. ఇకపై ఇనుము నుండి తుప్పు తొలగించడానికి ఈ పని చేయండి.

ఇనుప వస్తువులపై తుప్పును ఎలా శుభ్రం చేయాలి..

ఇనుముపై ఉన్న తుప్పును శుభ్రం చేయడానికి, ముందుగా ఇనుము నుండి దుమ్ము, ధూళి మొత్తం తొలగిపోయేలా శుభ్రమైన గుడ్డతో తుడిచేయండి. ఏదైనా హార్డ్‌వేర్ స్టోర్ నుండి బోరాక్స్ పౌడర్, సాండ్ పేపర్ కొనుగోలు చేయండి.. మీరు చాలా వస్తువులను శుభ్రం చేయడానికి బోరాక్స్ పౌడర్‌ని చాలాసార్లు ఉపయోగించే ఉంటారు. ఇనుముపై ఉన్న రస్ట్‌ను బోరాక్స్ పౌడర్‌తో సులభంగా తొలగించవచ్చు. అన్నింటిలో మొదటిది, ఒక గిన్నెలో 3-4 స్పూన్ల బోరాక్స్ పొడిని తీసుకోండి. ఇప్పుడు దానికి 3-4 చుక్కల నీటిని కలిపి మందపాటి పేస్ట్‌ను తయారు చేయండి. ఈ పేస్ట్‌ను తుప్పు మీద అప్లై చేసి 5 నిమిషాలు అలాగే ఉంచండి. 5 నిమిషాల తర్వాత, ఉప్పు కాగితంతో ఇనుముపై తుప్పును శుభ్రం చేయండి. ఈ విధంగా ఇనుముపై ఉన్న తుప్పు చాలా సులభంగా శుభ్రం తొలగిపోతుంది.

ఇవి కూడా చదవండి

ఇనుప వస్తువులపై పేరుకుపోయిన తుప్పును సున్నం పొడితో కూడా శుభ్రం చేసుకోవచ్చు..

సున్నం పొడిని ఉపయోగించడం ద్వారా కూడా ఇనుముపై ఉన్న తుప్పును చాలా సులభంగా శుభ్రం చేయవచ్చు. తుప్పును సున్నపు పొడితో శుభ్రం చేయడానికి, బోరాక్స్ పొడి, సున్నపు పొడిని సమాన పరిమాణంలో కలపండి. ఇప్పుడు దానికి నీరు కలుపుతూ మందపాటి పేస్ట్‌లా తయారు చేయాలి. తుప్పు పట్టిన ప్రదేశంలో 5 నిమిషాలు అలాగే ఉంచండి. 5 నిమిషాల తర్వాత, ఉప్పు పేపర్‌ అట్టతో రుద్దడం ద్వారా ఇనుముపై పేరుకుపోయిన తుప్పు ఈజీగా తొలగిపోతుంది.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..