Inspirational Story: అయ్యో.! 'ఆడపిల్ల' అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!

Inspirational Story: అయ్యో.! ‘ఆడపిల్ల’ అనుకునే వాళ్లకు.. ఈ తండ్రి కథే ఓ స్ఫూర్తి.!

Anil kumar poka

|

Updated on: Feb 21, 2024 | 8:08 PM

ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్లు .. మగవాళ్లకు ఎందులోనూ తీసిపోం అన్నట్లు ప్రతీ రంగంలో దూసుకుపోతున్నా లింగ వివక్ష మాత్రం అలానే ఉంది. 'ఆడపిల్ల' అనగానే చాలా మంది తల్లిదండ్రులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఉంటుంది. కానీ ఇక్కడొక తండ్రి అందుకు విరుద్ధంగా ఆలోచించడమే కాదు, శభాష్‌ ఇలా పెంచాలి ఆడపిల్లని అని అందరి చేత ప్రశంసలందుకున్నాడు.

ప్రస్తుత రోజుల్లో ఆడవాళ్లు .. మగవాళ్లకు ఎందులోనూ తీసిపోం అన్నట్లు ప్రతీ రంగంలో దూసుకుపోతున్నా లింగ వివక్ష మాత్రం అలానే ఉంది. ‘ఆడపిల్ల’ అనగానే చాలా మంది తల్లిదండ్రులకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఉంటుంది. కానీ ఇక్కడొక తండ్రి అందుకు విరుద్ధంగా ఆలోచించడమే కాదు, శభాష్‌ ఇలా పెంచాలి ఆడపిల్లని అని అందరి చేత ప్రశంసలందుకున్నాడు. బిహార్‌లోని సరన్‌ జిల్లాకు చెందిన రాజ్‌కుమార్‌ సింగ్‌ పిండి మిల్లు కార్మికుడు. ఆయన కూడా అందరిలా తనకి వారసుడు పుట్టాలని ఎంతగానో అనుకున్నాడు. ఏడుగురు పిల్లల్ని కన్నాడు. అందరూ ఆడపిల్లలే పుట్టారు. అయితే ఏంటీ? మంచి చదువులు చెప్పించి శివంగుల్లా పెంచాలనుకున్నాడు. అందరిలా ఇతను కూడా తన కూతుళ్లను ఓ వయసు వచ్చాక ఓ అయ్య చేతిలో పెట్టేయాలనుకోలేదు. తన తాహతుకు మించి ఏడుగుర్నీ ఉన్నత చదువులు చదివించాడు. ఇక్కడ రాజసింగ్‌ ని కూతుళ్ల పెళ్లిళ్ల గురించి ఇరుగుపొరుగు వారు పదేపదే గుర్తు చేస్తూ భయపెడుతూనే ఉండేవారు. కానీ ఆ తండ్రి మాత్రం కూతుళ్లను వాళ్ల కాళ్లమీద నిలబడిగలిగేలా పెంచితే చాలు అనే సూత్రాన్ని గట్టిగా నమ్మేవాడు. అదే నిజమయ్యేలా చేశాడు.

ఏడుగురు కూతుళ్లు ప్రభుత్వోద్యోగాలు సాధించి తం‍డ్రి ఆలోచనను నిజం చేశారు. పెద్ద కూతురు రాణి బీహార్ ఉమెన్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా చేస్తోంది. రెండవ కూతురు హని ఎస్.ఎస్.బి లో ఉద్యోగం చేస్తోంది. మూడవ కూతురు సోనీ సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. నాలుగవ కూతురు ప్రీతి క్రైమ్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఐదవ కూతురు పింకీ ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. ఆరవ కూతురు బీహార్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పని చేస్తోంది. ఏడవ కూతురు రైల్వే శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తోంది. ఇన్నాళ్లు రాజ్‌ కుమార్‌ని ఆడిపిల్లలు అని భయపెట్టే ఇరుగుపొరుగు అంతా అతన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు. పైగా పెంచితే అతడిలా పెంచాలి అని మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..