Kurnool: మరో రెండు వారాల్లో చెల్లెలి పెళ్లి.! ఇంతలోనే ఉహించుకొని షాక్.! వీడియో.
చెల్లెలి పెళ్లికోసం ఆ అన్న అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కష్టపడి కూడబెట్టిన డబ్బుతో బంగారు నగలు చేయించాడు. పెళ్లి ఖర్చులకని తెలిసినవారివద్దనుంచి 15 లక్షల వరకూ అప్పుతెచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంక రెండు వారాల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇంట్లో అంతా సందడిగా ఉంది. పెళ్లిపనులతో అంతా బిజీగా ఉన్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటుండగా ఆ ఇంట ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
చెల్లెలి పెళ్లికోసం ఆ అన్న అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు. కష్టపడి కూడబెట్టిన డబ్బుతో బంగారు నగలు చేయించాడు. పెళ్లి ఖర్చులకని తెలిసినవారివద్దనుంచి 15 లక్షల వరకూ అప్పుతెచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంక రెండు వారాల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఇంట్లో అంతా సందడిగా ఉంది. పెళ్లిపనులతో అంతా బిజీగా ఉన్నారు. అంతా సవ్యంగా సాగుతుందనుకుంటుండగా ఆ ఇంట ఊహించని సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికోసం సమకూర్చుకున్న డబ్బు, నగలు అన్నీ క్షణాల్లో కాలిబూడిదైపోయాయి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి చెందిన మోహన్‌రావు చెల్లి పెళ్లికోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. పెళ్లిబట్టలు, నగలు, డబ్బు అన్నీ సమకూర్చుకుని ఇంట్లోని బీరువాలో పెట్టారు. సోమవారం ఆ ఇంట్లో షాట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. పెళ్లికోసం సమకూర్చుకున్న నగదు, నగలు, బట్టలు అన్నీ కాలిపోయాయి. మంటలు ఆర్పి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ మంటలు పెద్దగా ఎగసిపడటంతో భయంతో అందరూ ఇంట్లోంచి బయటకు పరుగులు తీశారు. కళ్లెదుటే తాముపడ్డ కష్టం కాలి బూడిదైపోతుంటే కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అగ్నిప్రమాదంతో సర్వం కోల్పోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..