Ice Tea: వాహ్‌! ఐస్ టీ సూపర్బ్.! మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.

Ice Tea: వాహ్‌! ఐస్ టీ సూపర్బ్.! మంచును కరిగించి టీ కాచిన పర్యాటకులు.. వీడియో.

Anil kumar poka

|

Updated on: Feb 21, 2024 | 9:09 PM

బయట మంచు కురుస్తుంటే లోపల టీ తాగితే బాగుంటుంది. కాని మంచు మధ్యలో కూర్చుని మంచుని కరిగించి టీ కాచుకుంటే? అదీ బాగుంటుందని 78 మిలియన్ల వ్యూస్‌ చెబుతున్నాయి. కశ్మీర్‌కు షికారుకు వెళ్లిన ముగ్గురు మిత్రులు మంచి పాట వింటూ గుప్పెడు మంచుతో టీ కాచారు. వైరల్‌ అయ్యారు. చల్లటి ప్రాంతంలో అందరూ తాగేది టీ. చలి ముఖాన చరుస్తూ ఉంటే పొగలు గక్కే టీ పెదాలకు అందుతూ ఉంటే ఆ మజాయే వేరు.

బయట మంచు కురుస్తుంటే లోపల టీ తాగితే బాగుంటుంది. కాని మంచు మధ్యలో కూర్చుని మంచుని కరిగించి టీ కాచుకుంటే? అదీ బాగుంటుందని 78 మిలియన్ల వ్యూస్‌ చెబుతున్నాయి. కశ్మీర్‌కు షికారుకు వెళ్లిన ముగ్గురు మిత్రులు మంచి పాట వింటూ గుప్పెడు మంచుతో టీ కాచారు. వైరల్‌ అయ్యారు. చల్లటి ప్రాంతంలో అందరూ తాగేది టీ. చలి ముఖాన చరుస్తూ ఉంటే పొగలు గక్కే టీ పెదాలకు అందుతూ ఉంటే ఆ మజాయే వేరు. రాహుల్‌ యాదవ్‌ అనే ట్రావెలర్‌ ఇన్‌స్టాలో తన ట్రావెల్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తుంటాడు. జనవరి 29న అతను తన ఇద్దరు మిత్రులతో ఒక వీడియో పెట్టాడు. అది విపరీతంగా జనానికి నచ్చేసింది. కారణం.. కశ్మీర్‌లో నిర్మానుష్యమైన లోయలో, గడ్డ కట్టిన సెలయేటి మధ్యలో కూచుని ఆ మిత్రులు ‘టీ తయారు చేశారు’. అది మామూలుగా కాదు. మంచులో.! టీ గిన్నెలో అక్కడున్న మంచును వేసారు! క్యాంప్‌ స్టవ్‌ మీద ఆ మంచు నిండిన టీ గిన్నె కాసేపటికి వేడి నీరుగా మారింది. అందులో కొంత టెట్రా మిల్క్‌ వేశారు. ఆ పై టీ పొడి, చక్కరను వేస్తే చిక్కటి రంగులో ఘుమఘుమలాడే టీ తయారైంది. ఇటీవల విడుదలైన ‘డంకీ’లోని పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తూ ఉండగా ఆ ముగ్గురూ అందరికీ ఈర్ష్య కలిగేలా టీ తాగారు. ఈ వీడియోను రెండు వారాల్లో 7 కోట్ల 8 లక్షల మంది చూశారు. ‘మేం కూడా ఎప్పుడో ఒకసారి ఇలా తాగకపోతామా?’ అని కొందరంటే ‘సేఫేనా?’ అని కొందరన్నారు. బ్యాక్టీరియా ఉంటుందేమో అని మరికొందరు సందేహం వెలిబుచ్చారు. బాగా వేడి చేశారు కనుక బ్యాక్టీరియా ఉండకపోవచ్చు ఇలా కామెంట్లతో హోరెత్తించేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..