Chhatrapati Shivaji - Srisailam: ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?

Chhatrapati Shivaji – Srisailam: ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి.. శ్రీశైలానికి శివాజీకి ఏంటి సంబంధం?

Anil kumar poka

|

Updated on: Feb 21, 2024 | 8:26 PM

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో చత్రపతి శివాజి మహరాజ్ 394వ జయంతి వేడుకలను శ్రీశైలం గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా భారీ శివాజి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వందకు పైగా ద్విచక్ర వాహనాలతో దేవస్థానం పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. శోభాయాత్రలో గ్రామస్థులు కాషాయం కండువా, టోపీలు ధరించి శివాజి మహరాజ్ కు జేజేలు కొడుతూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు.

నంద్యాల జిల్లా శ్రీశైలం క్షేత్రంలో చత్రపతి శివాజి మహరాజ్ 394వ జయంతి వేడుకలను శ్రీశైలం గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. వేడుకలో భాగంగా భారీ శివాజి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వందకు పైగా ద్విచక్ర వాహనాలతో దేవస్థానం పరిధిలో భారీ ర్యాలీ నిర్వహించారు. శోభాయాత్రలో గ్రామస్థులు కాషాయం కండువా, టోపీలు ధరించి శివాజి మహరాజ్ కు జేజేలు కొడుతూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. శ్రీశైలం క్షేత్రం ముందునుంచి ప్రారంభమైన ఈ శోభాయాత్ర నందిమండపము, ఉద్యోగుల వసతి భవనాలు, మల్లికార్జునసదన్, శ్రీగిరికాలనీ, రుద్రాక్షమఠం గుండా శివాజి స్పూర్తి కేంద్రం వరకూ సాగింది శివాజి స్పూర్తి కేంద్రంలో నిర్వహించిన సభలో చత్రపతి శివాజి మహరాజ్ చరిత్ర, హిందూ సాంమ్రాజ్య ఏర్పాటుకు ఆయన చేసిన యుద్ధాలు, వీరోచిత పోటాలను వక్తలు కొనియాడారారు. శివాజీ జయంతి సందర్భంగా చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. శ్రీశైలంలో చత్రపతి శివాజీ పాత్రను కొనియాడాల్సిందే. ఆయన స్వయంగా శ్రీశైలం సందర్శించి ఉత్తర ద్వారంలో గోపురాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. అందుకే శివాజీ స్ఫూర్తి కేంద్రం సహా ప్రతి ఏటా గ్రామస్తులు ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరుపుకుంటారు

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..